Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్‌.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!

ఆవు పేడతో ఓ మహిళ గోడపై పిడకలు పెడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గోడ భారీ ఎత్తులో ఉన్నప్పటికీ........

Updated : 02 Jul 2022 09:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో అనేక ఆసక్తికర వీడియోలు వెలుగులోకి వస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి మరో వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఆవు పేడతో ఓ మహిళ గోడపై పిడకలు పెడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గోడ భారీ ఎత్తులో ఉన్నప్పటికీ.. అలవోకగా వరుస క్రమంలో అతికేలా పేడ ముద్దలను విసురుతుండటం చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ‘త్రో’కు పైనుంచి కిందకు వరుసగా పేడ ముద్దలు అతుక్కుంటుండటం చూసి నెటిజన్లు వావ్‌.. అంటున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరణ్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంటూ.. ‘జాతీయ బాస్కెట్‌ బాల్‌ జట్టు ఈమె కోసం వెతుకుతోంది’ అంటూ సరదా వ్యాఖ్యను జోడించారు. కాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 1.5మిలియన్ల మంది వీక్షించారు. దాదాపు 49వేల మంది లైక్‌ చేశారు. కాగా అనేక మంది ఆ మహిళ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ‘ఈమె తరహాలోనే దేశంలో అనేకమంది ప్రతిభావంతులు ఉన్నారు.. వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని