Viral Video:కొత్త ఫోన్‌ని చూసి ఆనందంలో మునిగితేలిన తల్లి.. హీరో మాధవన్‌ రీ ట్వీట్‌

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించడానికి పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పనిచేస్తారు. పిల్లలు తమకు ఫలానా వస్తువు కావాలని మరం చేస్తే కాదనకుండా కొనిచ్చి సంతోషపెడతారు.

Published : 07 Jan 2022 23:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించడానికి పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పనిచేస్తారు. పిల్లలు తమకు ఫలానా వస్తువు కావాలని మారం చేస్తే కాదనకుండా కొనిచ్చి సంతోషపెడతారు. అలాగే చదువులు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే, కొన్నిసార్లు అడగకుండానే మనకిష్టమైన వస్తువులను తెచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు పేరెంట్స్‌. అయితే, తల్లిదండ్రులకు బహుమతులు అందించి వాళ్లను ఆశ్చర్యపరిచే పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు. 

ఇదంతా.. ఎందుకు చెప్తున్నామంటే ఓ కుమారుడు తన తల్లి పుట్టినరోజున ఓ బహుమతిని అందించి ఆమెని ఆశ్చర్యానికి గురిచేశాడు. తమిళనాడుకు చెందిన ఓ కుర్రాడు తన తల్లికి పుట్టిన రోజు కానుకగా రూ.8800 విలువైన కొత్త ఫోన్‌ తీసుకొచ్చి ఓ కవర్‌లో పెట్టి ఇంట్లో ఉంచాడు. ఈ విషయం ఆమెకు తెలియక అందులో ఏముందో అని తెరిచిచూడగానే కొత్త ఫోన్‌ కనిపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వెంటనే తన కుమారుడిని ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ఆనందంలో మునిగితేలింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హీరో మాధవన్ ఈ వీడియోను చూసి చాలా సంతోషించాడు. అంతేకాదు ఈ వీడియోని రీ ట్వీట్‌ చేస్తూ ‘ఈ ఆనందానికి డబ్బుతో వెలకట్టలేము’ అని తమిళంలో రాసుకొచ్చాడు. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని