Published : 16 Nov 2021 01:28 IST

Viral Video: చెప్పుతో బెదిరించిన మహిళ.. హడలి పారిపోయిన మొసలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొసలి కనిపిస్తే ఏం చేస్తాం? భయపడి ఆమడ దూరం పారిపోతాం. నీళ్లలో ఉండే మొసలి వేట ఎంత చాకచక్యంగా ఉంటుందో.. నోట కరిచిందంటే అంతబలంగా నీళ్లలోకి లాగేయగలదు. ఏనుగు సైతం దాని నుంచి బయటపడలేక దేవున్ని ప్రార్థించిందని గజేంద్ర మోక్షం అనే కావ్యంలో చదువుకున్నాం. అంతటి క్రూరమైన మొసలిని.. పారిపోయేలా చేసింది ఓ మహిళ. ఆమె మొసలిని తరిమికొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ మహిళ తన పెంపుడు శునకంతో నది ఒడ్డున నిల్చొని ఉండగా.. నదిలో ఉన్న మొసళ్లలో ఒక మొసలి వారిని గమనించింది. ఈ రోజుకి ఆహారం దొరికిందోచ్‌ అనుకుంటూ.. అది నెమ్మదిగా వారి వైపు రావడం మొదలుపెట్టింది. మొసలి రాకను గమనించిన ఆ మహిళ.. అది సమీపానికి రాగానే తన కాలికి ఉన్న చెప్పు తీసి చేతితో పట్టుకొని కొడతా అన్నట్లు బెదిరించింది. దీంతో ఆ మొసలి భయపడి పలాయనం చిత్తగించింది. అసలు ఏ మాత్రం బెదరకుండా చెప్పుతో మొసలిని హడలెత్తించిన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎవరైనా సరే చెప్పు చూపిస్తే భయపడతారని, అది యూనివర్సల్‌ లాంగ్వేజ్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. తల్లి చెప్పు తీస్తే దాని అర్థమేంటో అందరికీ తెలుసు.. ఆ మొసలికి కూడా తెలిసే పారిపోయి ఉంటుందని, ఇలాంటి మహిళను నేను ఎక్కడా చూడలేదంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని