భలే..భలే ..భారీచేపలు

కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జాలర్ల చేతికి రెండు భారీ చేపలు చిక్కాయి. ఇవి చాలా అరుదుగా కనిపించే మీనాలట. ఈ రెండు చేపల్లో  ఒకటి సుమారు 750 కిలోల బరువు ఉండగా, మరో చేప 250 కిలోల బరువుందట. ఈ అరుదైన మీనాలను

Updated : 22 Nov 2022 16:08 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జాలర్ల చేతికి రెండు భారీ చేపలు చిక్కాయి. ఇవి చాలా అరుదుగా కనిపించే మీనాలట. ఈ రెండు చేపల్లో  ఒకటి సుమారు 750 కిలోల బరువు ఉండగా, మరో చేప 250 కిలోల బరువుందట. ఈ అరుదైన మీనాలను  స్టిన్ గ్రే చేపలు అని పిలుస్తారట. జాలర్లకు చేపలు చిక్కటం గురించి తెలుసుకున్న స్థానికులు, వాటిని చూసేందుకు పెద్దసంఖ్యలో తరలి వెళ్లారు. చూసేందుకు భారీగా ఉండే ఈ చేపలు చదునైన ఆకారంలో భలేగా ఉన్నాయి. భారీగా, నల్లటి ఆల్చిప్ప మాదిరిగా కనిపిస్తున్నాయి. స్థానికంగా ఈ అరుదైన భారీ చేపలను థోరెక్‌ మీను అని పిలుస్తారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి!

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు