పంజాబ్‌: భాంగ్రా నృత్యం చేసిన ‘రావణ’

ప్రతి ఏటా దేశవ్యాప్తంగా దసరాను ఎంతో వైభవంగా జరుపుకునేవాళ్లం. అయితే ఈ సారి కరోనా మహమ్మారి దెబ్బకు తక్కువ మందితోనే...

Published : 27 Oct 2020 15:30 IST

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏటా దేశవ్యాప్తంగా దసరాను ఎంతో వైభవంగా జరుపుకొనేవాళ్లం. అయితే ఈసారి కరోనా మహమ్మారి దెబ్బకు తక్కువ మందితోనే సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి. నవరాత్రులు ముగింపు రోజున రావణాసురుడి బొమ్మను దహనం చేసే అద్భుతమైన ఘట్టాన్ని చూసి తీరాల్సిందే. అలాగే ఉత్తర భారతంలో చాలా చోట్ల రామ్‌లీలా నాటక ప్రదర్శన ఉంటుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారీగా ప్రేక్షకులు లేకుండా నాటక ప్రదర్శనను వర్చువల్‌గా నిర్వహించారు. ఇలా పంజాబ్‌లో ప్రదర్శితమైన రామ్‌లీలా నాటకానికి సంబంధించిన వీడియో నెట్టిట్లో వైరల్‌గా మారింది. రావణాసురుడి పాత్రధారి చేసిన భాంగ్రా నృత్యం సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేసింది. పంజాబీ పాటలకు అనుగుణంగా రావణాసురుడి వేషధారి వేసిన భాంగ్రా నృత్యం వీక్షకులను ఆకట్టుకుంది. మరి ఆ భాంగ్రా నృత్య వీడియోను మీరూ వీక్షించి ఆనందించండి..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని