Viral Video: అంత కోపం.. ఎందుకయ్యా?

వివాహాల్లోని అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ ఏడాది

Published : 20 Jul 2021 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహ వేడుకల్లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన ఘటన నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వధువు నుదుట వరుడు సింధూరం పెడుతుండగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాంతో వరుడు కోపంతో చిందులేశాడు. తలపాగ, మెడలో దండ తీసి వధువు మీద పడేసి, పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. బంధువులు రమ్మని పిలిచినా.. ఏ మాత్రం వినిపించుకోలేదు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని