Viral Video: వరుడిని ఆటపట్టించిన వధువు
పానీపూరీ కోసం ఉవ్విళ్లూరుతున్న వరుడిని వధువు ఆటపట్టించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివాహ వేడుక సమయంలో వధువు ప్లేట్లో పానీ పెట్టగా....
ఇంటర్నెట్ డెస్క్: పానీపూరీ కోసం ఉవ్విళ్లూరుతున్న వరుడిని వధువు ఆటపట్టించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివాహ వేడుక సమయంలో వధువు ప్లేట్లో పానీపూరి పెట్టగా ఆశగా నోరు తెరుస్తాడు వరుడు. అతడి నోటి దగ్గరికి పానీపూరి తీసుకెళ్లిన వధువు వరుడికి తినిపించకుండా తానే తింటుంది. రెండోసారైనా తినిపిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న వరుడికి ఈసారీ నిరాశే ఎదురవుతుంది. రెండోసారి కూడా వరుడి నోటి దగ్గరకు తీసుకెళ్లి.. అతడు తినేందుకు ముందుకొస్తుండగా దాన్ని మళ్లీ తానే ఆరగిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను వధువు సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు. 11 లక్షల మందికి పైగా లైక్ చేశారు. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!