Viral video: నవవధువుకు పానీపూరీ కిరీటం..!

భారత్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఆహారపదార్థాల్లో పానీపూరీ కూడా ఒకటి. సాయంత్రమైతే చాలు అలా ఊళ్లో షికారు చేస్తూ పానీపూరీ బండి కనిపించగానే దాని ముందు ఆగిపోయేవారి సంఖ్య ఎక్కువే.

Published : 06 Jul 2021 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఆహారపదార్థాల్లో పానీపూరీ కూడా ఒకటి. సాయంత్రమైతే చాలు అలా ఊళ్లో షికారు చేస్తూ పానీపూరీ బండి కనిపించగానే దాని ముందు ఆగిపోయేవారి సంఖ్య ఎక్కువే. వాటిపై ప్రత్యేకించి అమ్మాయిలకు ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. అలాంటి ఓ యువతి తనకిష్టమైన పానీపూరీని మధుర జ్ఞాపకంగా మలుచుకుంది. ఆమె తన పెళ్లి వేడుకలో పానీపూరీ కిరీటం ధరించి వాటిపై తనకున్న మక్కువను అందరికీ తెలియజేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ నవవధువు తన పెళ్లి వేడుకలో బంగారం సహా పానీపూరీ దండలను ధరించి కనిపించింది. ఆమె ముందున్న ప్లేటు సైతం పానీపూరీలతో నింపేశారు. ఆదే సమయంలో ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరు పానీపూరీలతో తయారు చేసిన కిరీటాన్ని ఆమె తలపై పెట్టారు. అంతే.. ఇక ఆమె పెదాలపై నవ్వుల పువ్వులు విరిశాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ సరదా కామెంట్లతోనే ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదొక మధురమైన అనుభూతి అంటూ మరికొందరు తమ స్పందనను తెలియజేశారు. ఈ వీడియోను ఇప్పటికే 1.10 లక్షల మంది లైక్‌ చేశారు.    

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని