Viral: నీటిపై గాలిలో తేలినట్టుందే..

ఆహా!... ఆకుపచ్చ రంగు నేలలో నీరు, కనిపించే రాళ్లు, పడవ ప్రయాణం.. ప్రకృతి అందాలను కళ్లకు కట్టిపడేసేలా గీశాడే ఎవరో ఆ చిత్రకారుడు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే ఎందుకుంటే.. ఇది పెయింటింగ్‌ కాదు నిజమైన నది.

Published : 20 Nov 2021 08:20 IST

చిత్రం విడుదల చేసిన జల శక్తి మంత్రిత్వశాఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆహా!... ఆకుపచ్చ రంగు నేలలో నీరు, కనిపించే రాళ్లు, పడవ ప్రయాణం.. ప్రకృతి అందాలను కళ్లకు కట్టిపడేసేలా గీశాడే ఎవరో ఆ చిత్రకారుడు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే ఎందుకుంటే.. ఇది పెయింటింగ్‌ కాదు నిజమైన నది.  అంతే కాదు.. ప్రపంచంలోనే  పరిశుభ్రమైన నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది మరెక్కడో కాదండోయ్‌! మన భారతదేశంలోనే. ఈశాన్య రాష్ర్టమైన మేఘాలయాలోని ఓ నదిలో తేలియాడతున్న నదీ అందాలను, పడవ చిత్రాన్ని తాజాగా ట్విటర్‌ వేదికగా పంచుకుంది జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ. మేఘాలయా రాష్ర్ట రాజధాని షిల్లాంగ్‌కి సుమారు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉమ్‌గోట్ నది స్వచ్ఛతకు చిరునామాగా నిలిచింది.  ఈ నదీ అందాల గురించి కేంద్రమంత్రిత్వ జల శక్తి ఇలా ట్వీట్‌ చేసింది ‘‘ పడవ గాలిలో ఉన్నట్లు అనిపిస్తుంది కదూ! ఇక్కడ నీరు చాలా శుభ్రంగా, పారదర్శకంగా ఉంటుంది ఇదే స్ఫూర్తితో మన నదులన్నీ పరిశుభ్రంగా ఉండాలని కోరుకుందాం! రాష్ట్ర ప్రజలకు హ్యాట్సాఫ్’’ అని పేర్కొంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని