భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. వీడియో వైరల్‌ 

ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లా.........

Published : 12 Jan 2021 23:47 IST

సిద్ధిటెక్‌: ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లా సిద్ధిటెక్‌ పట్టణంలో సిద్ధి వినాయక ఆలయానికి వచ్చేవారికి షేక్‌హ్యాండ్‌ ఇస్తూ వార్తల్లోకెక్కింది. ఈ శునకం ప్రత్యేకతపై అరుణ్‌ లిమాడియా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వీధి శునకం సిద్ధివినాయక ఆలయం బయట మెట్లను ఆనుకొని ఉన్న పెద్ద గోడపై కూర్చొని ఉంది. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే భక్తులకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, ఒక చేతితో దీవించడంతో దీన్ని అంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆ శునకం చేసే పనులను చూసి భక్తులు మురిసిపోతున్నారు.

ఓ వ్యక్తి ఆలయం నుంచి బయటకు వస్తుండగా ఆ శునకాన్ని చూసి నమస్కరిస్తూ తన తలను కాస్త కిందకు వంచగా.. అతడిని దీవించడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ శునకంపై ప్రశంసలు కురిపిస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. భారీ సంఖ్యలో లైక్‌లు, షేర్‌లు వస్తుండటంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ క్యూట్‌ వీడియో మీరూ చూడండి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని