శునకమా.. ఎంతపనిచేశావే!

రష్యాలోని ఓ టీవీ కార్యక్రమం లైవ్‌లో అనుకోని ఓ అతిథి అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. మిర్‌ టీవీ ఛానల్‌....

Published : 03 Apr 2021 20:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యాలోని ఓ టీవీ కార్యక్రమం లైవ్‌లో అనుకోని ఓ అతిథి అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. మిర్‌ టీవీ ఛానల్‌ మహిళా రిపోర్టర్‌ నడేజెదా సెరెజ్కినా ఉష్ణోగ్రతల వివరాలు లైవ్‌లో చెప్పేందుకు సిద్ధమవుతుండగా.. ఓ శునకం ఆమెకు అడ్డుగా వచ్చింది. రిపోర్టర్‌ చేతిలోని మైక్‌ను లాక్కొని పరుగులు పెట్టింది. అనూహ్య ఘటనతో షాక్‌కు గురైన రిపోర్టర్‌  తన మైక్‌ కోసం ఆ శునకం వెంట పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ప్రత్యక్షప్రసారంలో అలాగే రావడంతో అంతా ఒక్కసారిగా  సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. శునకం చేసిన చేష్టలు చూసి అంతా నవ్వుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని