Viral Video: మద్యం మత్తులో రహదారిపై హల్‌చల్‌ చేసిన మహిళ

పుణెలో తిలక్‌ రోడ్‌లోని హిరాబాగ్‌ చౌక్‌ వద్ద రోడ్డుపై మంగళవారం రాత్రి 11 గంటల

Updated : 13 May 2022 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుణెలో తిలక్‌ రోడ్‌లోని హిరాబాగ్‌ చౌక్‌ వద్ద రోడ్డుపై మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. మద్యం మత్తులో ఉన్న మహిళ రోడ్డు మధ్యలో పడుకొని విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. కొంతమంది ప్రయాణికులు మహిళను రహదారి నుండి పక్కకు వెళ్లమని కోరగా ఆమె పట్టించుకోలేదు. దాంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని