Viral Video: డబ్బాతో పాలు తాగిన ఏనుగు

గత కొన్ని నెలలుగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఏనుగుల గుంపు ప్రయాణం

Published : 02 Jul 2021 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని నెలలుగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఏనుగుల గుంపు ప్రయాణం, ఏనుగు బోరు నీళ్లు తాగడం, అంబారీ ఏనుగు జలకాలాడటం, మరో ఏనుగు వంటింట్లో ప్రవేశించి హల్‌చల్‌ చేయడం లాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో నెట్టింటో చక్కర్లు కొట్టాయి. అయితే ఏనుగుల విన్యాసాలకు సంబంధించి ఎలాంటి వీడియో అయినా నెటిజన్లు ఇట్టే ఫిదా అయిపోతారు. కాగా ప్రస్తుతం ఓ చిన్న ఏనుగు ప్లాస్టిక్‌ డబ్బాతో పాలు తాగుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను షెల్‌డ్రిక్‌ వైల్డ్‌ లైఫ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకోగా.. అది కాస్తా వైరల్‌ అవుతోంది. డబ్బాతో పాలు తాగుతున్న ఏనుగు ‘బిగ్‌ బేబీ’లా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని