New York: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పైపును పట్టుకొని బయటపడ్డ అక్కాతమ్ముళ్లు!

భీకర ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అసాధారణ రీతిలో ఓ అక్క, తమ్ముడు అగ్నిప్రమాదం

Published : 20 Dec 2021 21:46 IST

న్యూయార్క్‌: భీకర ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అసాధారణ రీతిలో ఓ అక్క, తమ్ముడు అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకున్న ఘటన న్యూయార్క్‌లో జరిగింది. ఈస్ట్ విలేజ్ లోని జాకబ్ రియిస్ భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అన్ని వైపుల నుంచి మంటలు చుట్టుముట్టిన స్థితిలో అక్కాతమ్ముళ్లు ఆ భవనం కిటికీ ద్వారా బయటపడేందుకు యత్నించారు. ప్రమాదకర స్థితిలో కిటికీకి వెలాడుతూ.. పక్కనే ఉన్న పైపును పట్టుకున్నారు. క్షేమంగా కిందకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సహాయం కోసం ఎదురుచూడకుండా.. చాకచక్యంగా బయటపడ్డ ఆ అక్కాతమ్ముళ్లను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వారు నిజమైన హీరోలంటూ కొనియాడుతున్నారు.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని