Elephant: హెల్మెట్‌ను మింగిన ఏనుగు 

ద్విచక్ర వాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన అసోంలోని గువాహటిలో చోటుచేసుకుంది.

Updated : 11 Jun 2021 09:31 IST

గువాహటి: ద్విచక్ర వాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన అసోంలోని గువాహటిలో చోటుచేసుకుంది. సత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపాన సంచరిస్తున్న ఓ ఏనుగు... అక్కడ రోడ్డుపై నిలిపిన ద్విచక్ర వాహనం దగ్గరకు వచ్చింది. దాని బైక్‌ అద్దానికి తగిలించిన శిరస్త్రాణాన్ని తొండంతో లాఘవంగా బయటకు తీసి, లడ్డూను మింగినట్టు మింగేసింది. తర్వాత తనకేమీ తెలియనట్టు అక్కడి నుంచి నింపాదిగా ముందుకు సాగిపోయింది! ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని