Viralvideo: గ్లాస్‌ ఆక్టోపస్‌ని చూశారా ఎప్పుడైనా?

ఫినిక్స్‌ ఐలాండ్‌ టీమ్‌ 20 నిమిషాల పాటు దీన్ని చిత్రీకరించింది

Published : 12 Jul 2021 20:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సముద్రంలో కనిపించే ఆక్టోపస్‌.. రకరకాల రంగుల్లో, వివిధ ఆకారాల్లో ఉంటుందని విన్నాం. మరి ఎప్పుడైనా గ్లాస్‌ (గాజు) ఆక్టోపస్‌ గురించి విన్నారా? గ్లాస్‌ ఆక్టోపస్‌ ఏంటి.. నమ్మశక్యంగా లేదనిపిస్తోంది కదా! ఇప్పుడు మీరు చూస్తున్న ఆక్టోపస్‌ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఫినిక్స్‌ ఐలాండ్‌ టీమ్‌ 20 నిమిషాల పాటు దీన్ని చిత్రీకరించగా, స్మిత్ ఓషన్ ఇనిస్టిట్యూట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. పెలాజిక్ జాతికి చెందిన ఈ సముద్రజీవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణమండలాల్లోనే దర్శనమిస్తుందట. నీటిలో తేలుతున్నప్పుడు ఈ ఆక్టోపస్‌ శరీరం లోపలి భాగాలైన ఆప్టిక్‌ నరం, కనుబొమ్మలు, జీర్ణవ్యవస్థ (వెండిరంగులో మధ్యలో ఉంది) చూడాలనుకుంటే ఈ వీడియోని మీరూ వీక్షించేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని