Viral Video: నిత్య పెళ్లికొడుక్కిదేహశుద్ధి!

పెళ్లిలో కట్నం డిమాండ్ చేసిన వరుడికి దేహశుద్ధి చేసిన ఘటన దిల్లీలో జరిగింది. సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో నిర్వహించిన పెళ్లిలో ఈ ఘటన జరిగింది.

Published : 18 Dec 2021 15:48 IST

దిల్లీ: పెళ్లిలో కట్నం డిమాండ్ చేసిన వరుడికి దేహశుద్ధి చేసిన ఘటన దిల్లీలో జరిగింది. సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో నిర్వహించిన పెళ్లిలో ఈ ఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన ముజమ్మిల్ హుస్సేన్‌కు దిల్లీకి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి జరుగుతుండగా వరుడి తరఫు బం‍ధువులు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ముజమ్మిల్ హుస్సేన్‌కు గతంలోనే చాలా పెళ్లిళ్లు జరిగినట్లు వధువు బంధువులకు తెలిసింది. తీవ్రంగా ఆగ్రహించిన వధువు బంధువులు, అతిథులు.. పెళ్లికొడుకు సహా వారి కుటుంబసభ్యులపై దాడికి దిగారు. పెళ్లికొడుకుపై చీటింగ్ కేసు పెట్టిన వధువు కుటుంబీకులు.. అంతకుముందు అతడికి జరిగిన పెళ్లిళ్లకు సంబంధించిన ఫొటోలను పోలీసులకు అందించారు.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని