Viral News: ‘నా పేరు కొవిడ్‌.. నేను వైరస్‌ని కాదు’.. వైరల్‌ అవుతున్న కొవిడ్‌ కపూర్‌

2019 డిసెంబరులో చైనాలో పుట్టిన కరోనా.. 2020లో ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఎన్ని టీకాలు వచ్చినా కొత్త కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకొస్తూ మానవాళిపై

Published : 06 Jan 2022 18:58 IST

ఇంటర్నెట్ డెస్క్: 2019 డిసెంబరులో చైనాలో పుట్టిన కరోనా.. 2020లో ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఎన్ని టీకాలు వచ్చినా కొత్త కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకొస్తూ మానవాళిపై ఇంకా తన ప్రభావాన్ని చూపుతునే ఉంది. 2020కు ముందు కరోనా అంటే మార్కెట్‌లో లభించే బీరు పేరు మాత్రమే తెలుసు. ఈ ప్రాణాంతక వైరస్‌ని మనం కొవిడ్ అని కూడా పిలుస్తున్నాం. అయితే, ఈ మహమ్మారి (కరోనా) పేరును మనుషులు పెట్టుకుంటారని, పైగా ఆ పేరుతో ఒక మనిషి ఉన్నాడని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.

ఐతే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కరోనా పేరుతో ఓ వ్యక్తి ఉన్నాడు. బెంగళూరుకు చెందిన ఒక ఆన్‌లైన్‌ టూర్‌ ట్రావెల్స్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడి పేరు కొవిడ్‌ కపూర్‌. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విజృంభించక ముందు ఇతని గురించి పెద్దగా ఎవరికి పెద్దగా తెలీదు. ఎప్పుడైతే ఈ మహమ్మారి తీవ్రరూపం దాల్చిందో అప్పట్నుంచి కొవిడ్‌ కపూర్‌ పేరు బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలోనే తన పేరుతో సమస్యలను ఎదుర్కొన్నాడు. దీంతో అతడు ‘నా పేరు కొవిడ్‌.. నేను వైరస్‌ కాదు’ అని తన ట్విటర్‌ ఖాతా బయోలో రాసుకున్నాడు. ఇటీవల అతడు విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని ఆశ్చర్యపోవడమేకాక రకరకాల జోక్‌లు వేసుకుంటున్నారని ట్విటర్‌లో కొవిడ్ కపూర్‌ పేర్కొన్నాడు. భవిష్యత్తులో  కూడా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు తన పేరుతో సరదా సన్నివేశాలు చోటుచేసుకోవడం ఖాయమని అంటున్నాడు. ‘కొవిడ్‌’ అంటే అర్థమేంటో కూడా అతడు వివరించాడు.  తన పేరుకు ‘పండితుడు’ లేదా  ‘ప్రావీణ్యం ఉన్న వ్యక్తి’ అని హనుమాన్‌ చాలీసాలో ఉంటుందని వివరించాడు.

తన పేరు వల్ల ఏర్పడిన సరదా సన్నివేశాల గురించి అతడు చెప్పుకొచ్చాడు. అతని 30వ పుట్టిన రోజుకి స్నేహితులు కేక్‌ని ఆర్డర్‌ చేస్తే బేకరీ సిబ్బంది ఆ కేక్‌ మీద కొవిడ్‌ (Kovid) అని రాయకుండా (Covid) అని తప్పుగా రాశారని పేర్కొన్నాడు.  ఇలా సామాజిక మాధ్యమాల్లో తన పేరు గురించి  సరదాగా సాగిన సంభాషణలను ట్విటర్‌ పోస్టు చేశాడు. వాటిని మీరు చూసేయండి.







గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని