Viral Video: 12,000కేజీల వాహనాన్ని జుట్టుతో లాగేసింది!

అమ్మాయిలకు జుట్టంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందంగా కనిపించేందుకు జుట్టు మీద ఎంతో ఖర్చు చేస్తుంటారు కూడా! అలాంటిది భారత్‌కు చెందిన ఓ యువతి తన జట్టును కేవలం అందానికి.. అలంకరణకే పరిమితం చేయలేదు.

Updated : 04 Jan 2022 20:01 IST

నెట్టింట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మాయిలకు జుట్టంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందంగా కనిపించేందుకు జుట్టు మీద ఎంతో ఖర్చు చేస్తుంటారు కూడా! అలాంటిది భారత్‌కు చెందిన ఓ యువతి తన జుట్టును కేవలం అందానికి.. అలంకరణకే పరిమితం చేయలేదు. దాంతో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేయడమే కాకుండా పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు.. ఇలా మూడింటినీ సాధించింది.

తన జుట్టునే ఒక అస్త్రంగా మార్చి ఏకంగా 12,216 కేజీల డబుల్‌ డెక్కర్‌ బస్సును లాగి గిన్నిస్‌ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్న ఆమె పేరు ఆశా రాణి. ఈ ఘనత సాధించడం ద్వారా ‘ఐరన్‌ క్విన్‌’ అనే కీర్తి ప్రతిష్ఠను కూడా సంపాదించుకుంది. ఇది ఎప్పుడో 2016లో జరిగినా.. ఆ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌’ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆ వీడియోని మీరూ వీక్షించి ఆనందించండి..!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని