పక్షి దాహార్తి.. బాలుడి కరుణ దీప్తి..

‘‘పిల్లలూ దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే..’’ అని చిన్నారుల గొప్పతనాన్ని రచయితలు ఊరికే కీర్తించలేదు. తాజాగా ఓ పిల్లవాడు.....

Updated : 09 Apr 2021 00:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘పిల్లలూ దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే..’’ అని చిన్నారుల గొప్పతనాన్ని రచయితలు ఊరికే కీర్తించలేదు. తాజాగా ఓ పిల్లవాడు పక్షిపై చూపిన కరుణ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాహార్తితో అల్లాడుతున్న ఓ పావురం దప్పిక తీర్చేందుకు.. ఆ పిల్లాడు బాల్కనీలోంచి చేసిన ప్రయత్నం నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ అటవీశాఖ అధికారి సుశాంత నందా పోస్ట్‌ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఓ భవనం బాల్కనీ కింది భాగంలో ఉన్న చిన్నపాటి షెడ్‌పై ఓ పావురం వచ్చి వాలింది. ఆ పావురం దాహార్తితో ఉందని ఆ ఇంట్లో ఉన్న కుర్రాడికి ఎలా తెలిసిందో మరి!  వెంటనే గ్లాసు, గరిటె వెంట తెచ్చుకున్నాడు. గరిటెలో నీళ్లు నింపి.. ఆ పావురానికి నీళ్లు తాగించాడు. తద్వారా ఆ పక్షి దాహార్తిని తీర్చిన ఆ కుర్రాడు నెట్టింట్లో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని