Viral: ఈ సింహాల దారి.. రహదారి!

సింహాలు సాధారణంగా అభయారణ్యాల్లో కనిపిస్తాయి. లేదా జంతు ప్రదర్శనశాలలో

Published : 06 Jul 2021 23:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింహాలు సాధారణంగా అభయారణ్యాల్లో కనిపిస్తాయి. లేదా జంతు ప్రదర్శనశాల్లో దర్శనమిస్తాయి. అయితే గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో సింహాలు జనావాసాల్లోకి వచ్చి ఆశ్చర్యం కలిగించాయి. సోమవారం రాత్రి పదకొండున్నర సమయంలో గుజరాత్‌లోని పిపావావ్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై ఏకంగా ఐదు సింహాలు కనిపించాయి. కాగా సింహాలు రహదారిపైకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు వాటి సంచారాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా ఆ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని