Viral: మాస్క్‌ పెట్టుకోమని చెబుతున్న చిన్నారి

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటక ప్రాంతాలు ప్రజలతో

Published : 07 Jul 2021 23:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటక ప్రాంతాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ వీడియో. 

హిమచల్‌ ప్రదేశ్‌, ధర్మశాల వీధుల్లోని ప్రజలు మాస్క్‌ లేకుండా తిరుగుతుండగా.. ఓ చిన్నారి ప్లాస్టిక్‌ కర్ర చేత పట్టుకుని మాస్క్‌ పెట్టుకోమని అందరినీ హెచ్చరిస్తున్నాడు. అయితే ఎవ్వరూ ఆ చిన్నారి మాట వినకపోగా.. అతడిని చూసి నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారిని మెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లాడు అంతలా చెబుతున్నా ప్రజలు మాస్క్‌ పెట్టుకోక పోవడం బాధకలిగిస్తోందనీ, డబ్బు, చదువు వల్ల ఎలాంటి జ్ఞానం కలగదనీ  నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని