ViralVideo: ఈ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని తినేయొచ్చు! 

7 అడుగుల ఎత్తులో రూపొందించేందుకు 52కేజీల చాక్లెట్‌ వినియోగించారట అమౌరీ

Updated : 07 Jul 2021 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ చూడటానికి భలే ఉంది కదూ! ఇదంతా దేనితో తయారు చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే దీన్ని చాక్లెట్‌తో తయారు చేశారు కాబట్టి.  స్విట్జర్లాండ్‌కు చెందిన అమౌరీ గుయినోచ్ అనే పేస్ట్రీ చెఫ్‌ అమెరికా స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా దీన్ని రూపొందించారు. 7 అడుగుల ఎత్తులో రూపొందించేందుకు 52కేజీల చాక్లెట్‌ వినియోగించారట అమౌరీ. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా ఇప్పటికే 4 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకొని వైరల్‌గా మారింది. ఇంకెందుకాలస్యం మరి ఈ చాక్లెట్‌ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ మేకింగ్‌ వీడియోని మీరు చూసేయండి! 
 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని