Corona: మృతదేహాల మధ్య బాధితులకు చికిత్స

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజు 4 లక్షలకుపైగానే కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా పలు కారణాలతో కొన్ని కొన్నిమృతదేహాలు ఆసుపత్రుల్లోనే మగ్గిపోతున్నాయి....

Published : 09 May 2021 19:55 IST

బెంగళూరు: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజు 4 లక్షలకుపైగానే కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి.  వేలసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా పలు కారణాలతో కొన్ని కొన్నిమృతదేహాలు ఆసుపత్రుల్లోనే మగ్గిపోతున్నాయి. రోగులను, శవాలను ఒకే చోట ఉంచుతున్నారు. కర్ణాటకలోని ఓ ఆసుపత్రిలో ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. మండ్య జిల్లా మాలవళ్లి తాలూకా ఆసుపత్రిలో కొవిడ్‌ వార్డులోనే మహమ్మారితో మరణించిన వారి మృతదేహాలను ఉంచారు. అక్కడే రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పడకల కొరతతో పాటు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతున్నారు.

కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివ్‌ రేట్‌ 30 శాతంగా నమోదవుతోంది. రాజధాని బెంగళూరులో కొద్దిరోజుల క్రితం పాజిటివిటీ రేటు 50 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10వ తేదీ నుంచి కర్ణాటకలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని