Viral video: మేకను మింగేసిన కొండచిలువ

ఆహారం కోసం అడవికి వెళ్లిన ఓ మేకను కొండచిలువ మింగేసింది. సుమారు 15 అడుగులు పొడవు ఉన్న ఫైథాన్.. మేకను గట్టిగా చుట్టేసి పట్టుకుంది. మేక ప్రాణం పోయే వరకు వదలలేదు....

Published : 26 Jun 2021 21:45 IST

ముంబయి: ఆహారం కోసం అడవికి వెళ్లిన ఓ మేకను కొండచిలువ మింగేసింది. సుమారు 15 అడుగులు పొడవు ఉన్న ఫైథాన్.. మేకను గట్టిగా చుట్టేసి పట్టుకుంది. మేక ప్రాణం పోయే వరకు వదలలేదు. దీనికి సంబంధించిన వీడియోను మేకల కాపరి చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సత్పుడా అడవుల్లో జరిగింది. ఇలాంటి సమయాల్లో గొర్రెల, మేకల కాపరులు సైతం జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని