Viral: గేటు దూకి పెంపుడు శునకాన్ని నోటకరుచుకెళ్లిన చిరుత

రాత్రిపూట జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత.. ఓ ఇంటి గేటు దూకి పెంపుడు శునకాన్ని నోటకరుచుకెళ్లిన ఘటన గగుర్పాటుకు గురిచేస్తోంది......

Published : 28 Dec 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాత్రిపూట జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత.. ఓ ఇంటి గేటు దూకి పెంపుడు శునకాన్ని నోటకరుచుకెళ్లిన ఘటన గగుర్పాటుకు గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ సోషల్‌ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. రాత్రిపూట ఇంటి ఎదురుగా వెళుతున్న చిరుతను చూసి.. గేటు లోపల ఉన్న పెంపుడు శునకం అరుస్తుంది. ఇది గమనించిన చిరుత ఒక్కసారిగా ఇంటివైపు దూసుకొచ్చి గేటు దూకి ఆ శునకాన్ని నోటకరుచుకెళుతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ట్విటర్‌లో పంచుకోగా ప్రస్తుతం ఆ క్లిప్పింగ్‌ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. చిరుతపులులు కుక్కలను వేటాడడం కొండ ప్రాంతాలలో తరచుగా జరుగుతుంటాయని, ఇలాంటి దాడులను నివారించాలంటే పెంపుడు జంతువుల యజమానులు వాటి మెడకు ఇనుప కాలర్‌ను చుట్టాలని పర్వీన్‌ కాస్వాన్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఇలాంటి తొడుగులు క్రూర మృగాల దాడుల నుంచి రక్షిస్తాయని సూచించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని