పాల కోసం ఏనుగుల పరుగు.. వీడియో వైరల్‌

కెన్యాలోని నైరోబీలో అనాథ ఏనుగు పిల్లలకు సంరక్షకులు పాలుపడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. నైరోబీకి చెందిన షెల్విక్‌ వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌ అనే సంస్థ అనాథ ఏనుగులను కాపాడి వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవల అడవి నుంచి కొన్ని ఏనుగు పిల్లలను తీసుకొచ్చి..

Published : 07 Mar 2021 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెన్యాలోని నైరోబీలో అనాథ ఏనుగు పిల్లలకు సంరక్షకులు పాలుపడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. నైరోబీకి చెందిన షెల్విక్‌ వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌ అనే సంస్థ అనాథ ఏనుగులను కాపాడి వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవల అడవి నుంచి కొన్ని ఏనుగు పిల్లలను తీసుకొచ్చి వాటి సంరక్షణ చూసుకుంటుంది. ఆకలి తీర్చే క్రమంలో ఏనుగు పిల్లలకు పాలు పట్టేందుకు అక్కడి సంరక్షకులు వాటి వద్దకు వెళ్లారు. వారి చేతిలో పాల డబ్బాలను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని గున్న ఏనుగులు అందుకున్నాయి. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన ఏనుగు పిల్లలు పాలు తాగే దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని