గుర్రపు స్వారీ.. అమెజాన్‌ పార్శిల్స్‌ డెలివరీ..!

సాధారణంగా ఫుడ్‌ డెలివరీకి బైక్ లేదా ఇంకేదైనా వాహనం‌ వాడతారు. కానీ ఇక్కడో వ్యక్తి గుర్రంపై వచ్చి ఫుడ్‌ డెలివరీ చేస్తున్న దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కశ్మీర్‌, శ్రీనగర్‌లలో.......

Updated : 28 Jan 2021 20:25 IST

శ్రీనగర్‌: ఆన్‌లైన్‌లో మనం చేసుకొనే ఆర్డర్ల డెలివరీకి సాధారణంగా బైక్ లేదా ఇంకేదైనా వాహనం‌ వాడతారు. కానీ ఇక్కడో వ్యక్తి గుర్రంపై వచ్చి వస్తువులను డెలివరీ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కశ్మీర్‌, శ్రీనగర్‌లలో కురుస్తున్న హిమపాతంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలు కష్టంగా మారడంతో గుర్రపు స్వారీ ద్వారా అమెజాన్‌ ఆర్డర్లు డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వ్యక్తి గుర్రంపై మంచుతో కప్పబడిన రహదారులపై సంచరిస్తూ వినియోగదారులకు పార్శిల్స్‌ అందజేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ట్విటర్‌లో ఒక నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను అమెజాన్‌ డెలివరీ ఇన్నోవేషన్‌ అని పేర్కొంటూ ఓ వినియోగదారుడు ట్విటర్‌లో పంచుకున్నాడు. సంక్లిష్ట పరిస్థితుల్లో గుర్రంపై తన విధి నిర్వర్తిస్తున్న ఆ డెలివరీ బాయ్‌ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత వారం నుంచి జమ్ము కశ్మీర్‌లో నిరంతరాయంగా హిమపాతం కురుస్తోంది. ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. 

ఇవీ చదవండి..

సింహాన్ని నిలువరించిన శునకం..

మేమే నయం.. అంటున్న కుక్క, పిల్లి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని