Viral Video: పామును మింగిన పాము

కప్పని పాము మింగడం సహజం. కానీ పామును పాము మింగడం చాలా అరుదు.  

Published : 29 Jun 2021 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కప్పని పాము మింగడం సహజం. కానీ పామును, మరో సర్పం మింగడం చాలా అరుదు. అయితే, ఒక జాతికి చెందిన జంతువు, అదే జాతి జంతువును తినడాన్ని కానిబాలిజం అని పిలుస్తారు. ఒడిశాలో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 3 అడుగుల కోబ్రాను 4 అడుగుల తాచుపాము మింగేసింది. పాముల సంరక్షకులు తాచుపామును పట్టుకునే ప్రయత్నంలో మింగిన కోబ్రాను బయటకి వదిలేసింది. ఒడిశాలోని ఖుర్దా జిల్లా, బాలాకటి గ్రామంలో పాము తిరగడం గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించారు. వారు 4 అడుగుల తాచు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే తాచుపాము 3 అడుగుల సర్పాన్ని బయటకు కక్కింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని