Viralvideo: బాబోయ్‌.. ఇంత పెద్ద లాలీపాప్

25కేజీల లాలీపాప్‌..12గంటల శ్రమ

Published : 09 Jul 2021 23:39 IST

 వైరల్‌గా మారిన జైగాంటి కుకింగ్‌ వీడియో

మినియేచర్‌ కుకింగ్.. అతి చిన్న పాత్రలమీద వంటకాలు చేయడం.. ఇదంతా ఇంటర్నెట్‌లో ఇప్పుడు సాధారణమే. చూడటానికి కన్నుల పండుగగా ఉండే ఈ మినియేచర్‌ కుకింగ్‌కి యూట్యూబ్‌లో ఎప్పుడూ కోట్లలో వ్యూస్‌ ఉంటాయి. మరి ట్రెండ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! అందుకే దానికి విభిన్నంగా వచ్చింది జైగాంటిక్ కుకింగ్‌.. ఇదేం కుకింగ్‌ అనేదే కదా మీ ప్రశ్న... జైగాంటిక్‌లో పూర్తిగా వంటకాలన్నీ భారీసైజులో ఉండటమే.. అంటే మినియేచర్‌కు రివర్స్‌. తాజాగా విలేజ్ ఫుడ్‌ అనే కుకింగ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇద్దరు మలయాళీ యువకులు 25కేజీల లాలీపాప్‌ని తయారు చేశారు. దీనికోసం సుమారు 12గంటల సమయమే పట్టిందట. ప్రస్తుతం ఈ ఫుడ్‌ కుకింగ్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అంతేకాదు.. గతంలో వీరు తయారు చేసిన 50కేజీల మ్యాంగో ఐస్‌ క్యాండీ కూడా 2కోట్లకు పైగా వ్యూస్‌ సంపాదించుకొని వీక్షకుల మనసు దోచింది. ఇంకెందుకు ఆలస్యం ఈ జైగాంటిక్‌ కుకింగ్‌ వీడియోలు మీరూ చూసేయండి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని