Viralvideo: అదే జీవితం అనుకుంటే.. అంతే సంగతులు!!

డబ్బు వేటలో పడి మనల్ని మనం కోల్పోవడం జరుగుతుంది

Published : 16 Jul 2021 16:52 IST

జీవితంలో డబ్బు సంపాదించి స్థిరపడాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది కూడా. ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి స్థానంలో ఉండాలనుకుంటే సరేసరి. అలాకాకుండా అత్యాశకు పోతే.. డబ్బు వేటలో పడి మనల్ని మనం కోల్పోవడం జరుగుతుంది. చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదు. సరిగ్గా ఇదే అంశాన్ని.. ఆలోచింపజేసేలా ఓ వీడియోని రూపొందించారు వీడియో క్రియేటర్‌ అమైన్ కాన్జారి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. డబ్బే మనిషిని చంపేస్తుందని కొందరు.. సంపాదించే క్రమంలో రోగాలు కొని తెచ్చుకుంటున్నామని మరికొందరు.. డబ్బు వెంట పడకండి, మీరు చేసే పనికి డబ్బే మీవెంట రావాలే తప్ప.. దానికోసం మీరు పరుగెత్తకూడదంటూ.. ఇలా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని