Viral Video: నడిరోడ్డుపై నిప్పుతో చలగాటం!

సోషల్‌మీడియాలో తాము ఫేమస్‌ అవ్వాలని కొందరు చిత్రవిచిత్రమైన వీడియోలు రూపొందిస్తుంటారు. వాటిలో కొన్ని అద్భుతంగా అనిపిస్తే మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇంకొన్ని ప్రమాదక విన్యాసాలతో భయాభ్రాంతులకు గురయ్యేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది. 10-15 ఏళ్ల మధ్య

Published : 14 Jul 2021 23:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో ఫేమస్‌ అవ్వాలని కొందరు చిత్రవిచిత్రమైన వీడియోలు రూపొందిస్తుంటారు. వాటిలో కొన్ని అద్భుతంగా అనిపిస్తే మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇంకొన్ని ప్రమాదక విన్యాసాలతో భయాభ్రాంతులకు గురయ్యేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది. 10-15 ఏళ్ల మధ్య వయసున్న కొందరు కుర్రాళ్లు రద్దీగా ఉండే రోడ్డుపై మంట పెట్టి.. నోట్లో పెట్రోల్‌ పోసుకొని ఊదుతూ ఆ మంట మరింత ఎగిసిపడేలా చేస్తున్నారు. అందులో ఓ కుర్రాడు ఏ మాత్రం భయపడకుండా మంటకు దగ్గర కూర్చొని ఆటలు ఆడుతున్నాడు. అయితే, ఈ వీడియోను ఎవరు, ఎక్కడ చిత్రీకరించారనే సమాచారం లేదు..! ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇలాంటి ప్రమాదకర ఆటలు ఆడొద్దంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని