Published : 17 Jan 2022 01:19 IST

పర్యావరణ పరిరక్షణకు మిద్దెసాగు

పెరుగుతున్న ప్రోత్సాహం, ఆదరణ

ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా పెరిగిపోతోంది. ఫలితంగా పట్టణవాసులకు అవసరమైన ఆహార సరఫరా వ్యవస్థలు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. అలాంటి సందర్భాల్లో వారి ఆహార భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని రకాల నిత్యావసరాలను గ్రామాల నుంచి నగరాలకు సరఫరా చేయడం, నిల్వ ఉంచడం సవాళ్లతో కూడుకున్న విషయం. ప్రకృతి విపత్తులతో ఆహార పంటలను నష్టపోయినప్పుడు నగరాల్లో వాటికి కొరత ఏర్పడి ధరలు ఏ విధంగా ఆకాశాన్నంటుతాయో ప్రజలకు అనుభవ పూర్వకమే. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఇళ్ల పైకప్పుల మీద పంటలు పండించే మిద్దెసాగు ద్వారా ఆహార డిమాండ్‌ను కొంతమేర తీర్చవచ్చు. ఇది కొంతమందికి ఆదాయ మార్గంగానూ నిలుస్తుంది.

ఎన్నో నగరాల్లో ప్రాచుర్యం

భవనాలపై మొక్కల పెంపకం ఆనవాళ్లు క్రీస్తు పూర్వం మెసపొటేమియా నాగరికతలోనే ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. వారి మతపరమైన నిర్మాణాలైన ‘జిగ్గురాత్‌’ అనే భవనాల పైకప్పుపై మొక్కలు పెంచినట్లు ఆధారాలు ఉన్నాయి. రోమ్‌, ఈజిప్టు వంటి చోట్ల భవనాల పైకప్పుపై తోటలు పెంచినట్లు పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు వెలుగు చూశాయి. ఏడు వింతల్లో ఒకటైన బాబిలోన్‌ వేలాడే ఉద్యానవనాలు సైతం ఎత్తయిన భవనాలపై పెంచిన తోటలే. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా నగరాల్లో మిద్దె సాగు ప్రాచుర్యం పొందుతోంది. సింగపూర్‌ సహా న్యూయార్క్‌, అట్లాంటా, విక్టోరియా, టొరంటో, లండన్‌, ప్యారిస్‌, దుబాయి, బ్రస్సెల్స్‌, మనీలా వంటి నగరాల్లో ఇది చాలా ఆదరణ పొందుతోంది. సింగపూర్‌లో సంప్రదాయ సాగు పద్ధతిలోకంటే మిద్దెసాగులోనే ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి. మన దేశంలో ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో దాన్ని ఎక్కువగా చేపడుతున్నారు. హైదరాబాద్‌ తదితర నగరాల్లో భవనాల పైకప్పుల్ని కూరగాయల పెంపకానికి ఉపయోగించడం ద్వారా చాలా వరకు కొరత తీర్చవచ్చు. మిద్దెసాగు చేపట్టాలంటే ముందుగా భవనం పైకప్పు సామర్థ్యాన్ని అంచనా వేయాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి. పైకప్పు సామర్థ్యం అంచనాను బట్టే మొక్కల సంఖ్యను నిర్ణయించాలి. పురాతన భవనాలపై ఈ సాగు శ్రేయస్కరం కాదు. భవనంపై నీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవడంతోపాటు, ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థనూ నెలకొల్పాలి. ఇక్కడ సాగుచేసే పంటలకు తరచూ తెగుళ్లు, కీటకాల బెడద ఉంటుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ అవసరం. నీటికొరత ఉన్న పట్టణాలు, నగరాల్లో దీన్ని చేపట్టడం కొంత ఇబ్బందే. ఇది అన్ని రకాల పంటలకూ సానుకూలం కాకపోయినా- కూరగాయలు, దుంపలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూల సాగుకు మాత్రం ఎక్కువ అనుకూలం. మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఈ సాగు పెరుగుతోంది. మనదేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందించడం ద్వారా మిద్దెసాగును ప్రోత్సహిస్తున్నాయి. కొందరైతే నూతన భవనాలను నిర్మించేటప్పుడే పైకప్పును ఈ సాగుకు అనుకూలంగా చేపడుతుండటం దానిపై వారికి గల మక్కువకు నిదర్శనం. మిద్దెసాగును గ్రామాల్లోనూ చేపట్టవచ్చు. కాలుష్యం తక్కువగా ఉండే వాతావరణం పలు రకాల మొక్కల పెరుగుదలకు అనుకూలం.

ప్రయోజనాలెన్నో...

మిద్దెసాగు ముఖ్యంగా ఆకుకూరలు, వంగ, టమాటా, దోస, మిరప, ముల్లంగి, బంగాళాదుంప, పుచ్చకాయ, అల్లం తదితరాలను పండించేందుకు ఎంతో అనుకూలం. అలాగే కొన్ని రకాల పండ్ల మొక్కలను సైతం పెంచుకోవచ్చు. వాటిని సేంద్రియ పద్ధతిలో సాగుచేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ‘గృహ-కంపోస్టింగ్‌’ వంటి పద్ధతులను ప్రోత్సహించడంవల్ల చెత్తలో కలిసే వ్యర్థాలనూ తగ్గించవచ్చు. ఏ సమయంలోనైనా తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి.  రోజుకు కొంత సమయం తోటపని చేయడంద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అది మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఉష్ణ శోషణను తగ్గించే సామర్థ్యాన్ని మొక్కలు కలిగి ఉండటం వల్ల భవనం లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. నగరాలు, పట్టణాల్లో మిద్దె సాగును పెద్దయెత్తున చేపట్టడం వల్ల కాలుష్యం సైతం కొంతమేర తగ్గుతుంది. గాలి నాణ్యతను పెంచుతుంది. హరిత పట్టణం అనే భావన కార్యరూపం దాల్చడానికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. భవనాలపై పెరిగే మొక్కలు కొన్ని రకాల పక్షులకు ఆవాసాలుగానూ ఉంటాయి. కొవిడ్‌ పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రజలు తమ ఇంటి వద్దే సేంద్రియ పద్ధతుల్లో స్వచ్ఛమైన కూరగాయలను, పండ్లను పండించుకునేందుకు మిద్దెసాగు చేపట్టవచ్చు. దానిపై సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థల సేవలు పొందవచ్చు. ఆ సాగు కేవలం ఇంటి అవసరాలు తీర్చేందుకోసమే కాకుండా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేశంలో పోనుపోను సాగుభూమి తగ్గిపోతున్న నేపథ్యంలో మిద్దెసాగును మంచి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- డి.సతీష్‌బాబు

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

నెత్తురోడుతున్న రహదారులు

నెత్తురోడుతున్న రహదారులు

నిత్య నరమేధానికి ప్రబల కారణమవుతున్న అవి రహదారులు కావు... కోర సాచిన ‘తారు’ పాములు! రహదారి భద్రతకు తూట్లు పడి కొన్నేళ్లుగా రోడ్డుప్రమాదాల్లో లక్షలాది కుటుంబాలు చితికిపోతున్న దేశం మనది. కొవిడ్‌ సంక్షోభ వేళ 2020 సంవత్సరంలో ...
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని దక్షిణ చైనా సముద్రం గత 20 ఏళ్లుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. పసిఫిక్‌ మహాసముద్రంలో భాగమైన దక్షిణ చైనా కడలి 35 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దానిపై పూర్తి ఆధిపత్యానికి డ్రాగన్‌ దేశం అర్రులు చాస్తోంది. మత్స్య సంపద, ముడిచమురు, గ్యాస్‌ నిల్వలు అపారంగా
తరువాయి

ఉప వ్యాఖ్యానం

రైతుకు నకిలీల శరాఘాతం

రైతుకు నకిలీల శరాఘాతం

హరిత విప్లవం అనంతరం వ్యవసాయ దిగుబడులు పెరగడంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కీలక భూమిక పోషించాయి. దేశంలో ఎరువులు, పురుగు మందుల తయారీ, నూతన వంగడాల రూపకల్పనకు వేల సంఖ్యలో ప్రైవేటు సంస్థలు..
తరువాయి
అలవిమాలిన ఆదాయ అంతరాలు

అలవిమాలిన ఆదాయ అంతరాలు

‘దారిద్య్రం, అసమానతలు, అన్యాయాలు కొనసాగినంతకాలం ఎవరికీ సాంత్వన దొరకదు’ అన్నారు నెల్సన్‌ మండేలా. భారత్‌లో ఆదాయ పంపిణీలో అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆదాయ అసమానతల నివేదిక-2022 ప్రకారం...
తరువాయి

అంతర్యామి

ఆకులు రాల్చిన కాలం!

ఆకులు రాల్చిన కాలం!

గతించిన బాల్యం, గడచిన కౌమారం, ఆనందవాహినిలో తేలిపోయిన యౌవనం... ఎవరికైనా తీపిగుర్తులుగా మిగిలిపోతాయి. సుదూర గతం, సమీప గతం అన్న తేడా లేకుండా అన్నింటినీ కాలం క్రమంగా సౌధంలా పేర్చి సుందర భవనంలా నిలుపుతుంది. గతం కొందరికి మృతం...
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని