
డిజిటల్ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత
పటిష్ఠ కార్యాచరణ కీలకం
‘డిజిటల్ గేమింగ్ రంగంలో భారత్ అగ్రగామిగా మారాలి... మనదేశ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా ఆకర్షణీయమైన డిజిటల్ గేములను ఆవిష్కరించాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పిలుపిచ్చారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ (ఏవీజీసీ) రంగంలో ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చగలిగే సాధన సంపత్తిని భారత్ సమకూర్చుకోవడానికి ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలతో గేమింగ్ రంగంలో ఉపాధికి ఊతమిచ్చే దిశగా సాగుతున్నాయి. ఇండియాలో గేమింగ్ రంగాన్ని అభివృద్ధి చేస్తే దాదాపు 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చని కన్సల్టింగ్ సేవల సంస్థ డెలాయిట్ చెబుతోంది. గేమింగ్ రంగంలో మేధాసంపత్తి హక్కుల (ఐపీఆర్) సృష్టి అత్యంత కీలకం. అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఉన్న ఈ రంగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించాలంటే ఇతర దేశాల్లో ఎక్కడా లేని, మనకు మాత్రమే ప్రత్యేకమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. అందుకోసం నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలి. ప్రోత్సాహకాలు అందించి గేమింగ్ కంపెనీలు, అంకుర సంస్థలకు అండగా నిలవాలి.
చాలా ఏళ్లుగా గేమింగ్‌లో మేధాసంపత్తి గురించి భారత్ ఆలోచించలేదు. దాన్ని సేవారంగానికి చెందిన వస్తువుగానే పరిగణించింది. యాజమాన్య ఉత్పత్తుల (ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్)కు మాత్రమే అధిక విలువ లభిస్తుంది. భారత్ నుంచి ఏటా ఆవిష్కరిస్తున్న డిజిటల్ క్రీడలు చాలా తక్కువ. వాటి నాణ్యతా అంతంతే. గేముల అభివృద్ధి, ఆవిష్కరణకు విదేశీ సంస్థలు కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతను ఆవిష్కరించి డిజిటల్ ఆటల్లో వినియోగిస్తున్నాయి. నిపుణులైన మానవ వనరులను ఈ రంగంలోకి ఆకర్షిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ చాలా వెనకబడి ఉంది. గేమింగ్ సాంకేతికతపై తగినంత శిక్షణ ఇచ్చే విద్యాసంస్థలకు భారత్‌లో చాలా కొరత ఉంది. దీనిపై వెంటనే దృష్టి సారించాలి.
ప్రస్తుతం గేమింగ్ రంగాన్ని మొబైల్ ఫోన్లు శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 85శాతం వాటిలోనే ఆటలు ఆడుతున్నారు. భారత గేమింగ్ మార్కెట్లో మొబైల్ వాటా 50శాతానికి మించిపోయింది. మొబైల్ ఫోన్ల వాడకం అధికంగా ఉన్న ఇండియాలో అది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రంగంలో ఇండియా విశ్వగురువు కాగలదనే ధీమాకు అదే ఆధారం. అత్యాధునిక సాంకేతికతతో మొబైల్ క్రీడలను ఆవిష్కరించి, వాటిని ప్రపంచ మార్కెట్‌కు అందించే అద్భుతమైన అవకాశం భారత్‌కు ఉంది. దాన్ని గుర్తించి అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమ పరంగా గట్టి ప్రయత్నాలు జరగాలి.
కొవిడ్ మహమ్మారి వల్ల ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైనప్పుడు గేమింగ్‌కు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 270కోట్ల మంది డిజిటల్ క్రీడలతో కాలం గడిపినట్లు పరిశీలనలు చాటుతున్నాయి. ఆ సంఖ్య 400 కోట్లకు మించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. కేవలం పిల్లలు, యువకులే కాకుండా అన్ని వయసుల వారు, మహిళలు సైతం ఇటీవలి కాలంలో గేమింగ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. దానికి తగినట్లు కొత్త డిజిటల్ క్రీడల ఆవిష్కరణకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రంగంలోని అంకుర సంస్థలకు గత ఏడాదిన్నర కాలంలో రూ.12,000 కోట్ల పెట్టుబడి సమకూరింది. దీన్నిబట్టి ఈ రంగంపై పెట్టుబడిదారుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. సేవల రంగం చోదక శక్తిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో ఐటీ పాత్ర కీలకమైంది. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ విభాగమూ అంతటి సత్తా కలిగినవే. స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగితే ఈ రంగంలో అపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అదేసమయంలో విద్యార్థులపై మానసికంగా ప్రతికూల ప్రభావం చూపే ఆటలపట్ల అప్రమత్తం కావాలి. చిన్నారుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లని విధంగా గేమింగ్ రంగాన్ని తీర్చిదిద్దాలి.
- ఎల్.మారుతీశంకర్ (డిజిటల్ గేమింగ్ రంగ నిపుణులు)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం
ప్రధాన వ్యాఖ్యానం
ఉప వ్యాఖ్యానం
అంతర్యామి


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ