దొంగలబండి... వచ్చిందండి!
‘నేటి ఈ అతి ముఖ్యమైన మీటింగ్‌కి విచ్చేసిన దొంగ నా, సారీ నా దొంగ సహోదరులకు స్వాగతం. మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ ‘భలేవారే సార్, దొంగలు ఊళ్లు పంచుకోవడం తరతరాల సంప్రదాయం, దాన్ని తప్పగలమా? పైగా, ఏరియాల వారీగా దోచుకోవడమెలాగో ప్లానింగ్ ఇస్తామంటే రాకుండా ఎందుకుంటాం! అస్సలే, అయిదేళ్లలో తిన్నదానికంటే ఎక్కువే గుంజేయాలని ముందే ప్రణాళికతో ఉన్నాం’‘వెరీగుడ్, మీలాంటి సీనియర్ దొంగలు అలా ఉత్సాహంగా ఉంటే కొత్తగా వచ్చేవారిని కూడా బాగా ప్రోత్సహించగలరు...’

‘భలేవారే సార్, దొంగలు ఊళ్లు పంచుకోవడం తరతరాల సంప్రదాయం, దాన్ని తప్పగలమా? పైగా, ఏరియాల వారీగా దోచుకోవడమెలాగో ప్లానింగ్ ఇస్తామంటే రాకుండా ఎందుకుంటాం! అస్సలే, అయిదేళ్లలో తిన్నదానికంటే ఎక్కువే గుంజేయాలని ముందే ప్రణాళికతో ఉన్నాం’
‘వెరీగుడ్, మీలాంటి సీనియర్ దొంగలు అలా ఉత్సాహంగా ఉంటే కొత్తగా వచ్చేవారిని కూడా బాగా ప్రోత్సహించగలరు...’
‘మరేనండీ... ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం... గోడలెలా దూకాలి, కన్నం ఎలా వేయాలి, దొరక్కుండా ఎలా పరిగెత్తాలి, దొరికితే తన్నులెలా తట్టుకోవాలి... అన్నీ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నాం!’
‘నేనీసారి కొన్ని కొత్త ఆలోచనలు చేశాను, అందులో భాగంగా మనం జనంలోకి వెళ్ళాలి’
‘అయ్యబాబోయ్... నేరుగా దొరికితే కుమ్మేయరూ?అసలే మన ఫేస్‌వాల్యూ మహగొప్పది... పరదాలు కట్టుకుని దాక్కుంటూ తిరుగుతుంటాం!’
‘చెప్పేది పూర్తిగా వినవేం, దొంగలందరూ కలిసి ప్రజల మధ్యకెళ్ళి ప్రచారం చేసుకోవాలనేది మన తాజా సంకల్పం.’
‘ఏమని సార్?’
‘దొంగతనాలకు సహకరించమని... ఈ కార్యక్రమం పేరు ‘మా నమ్మకం నువ్వే దొంగా... దోచుకో అప్పనంగా!’
‘సార్... అమ్మదొంగ, జేబుదొంగ, యమదొంగ... అన్నీ విన్నాం కానీ ఇదెక్కడా వినలేదండీ’
‘అందుకే మనం ప్రవేశపెడుతున్నాం... ఇప్పుడీ పేరుతో ప్రతి ఇంటికీ స్టిక్కర్లు అతికిస్తామన్నమాట!’
‘ఎందుకు సార్?’
‘స్టిక్కర్ చూడగానే ఆ ఇంటికి మనలో ఎవరు దొంగతనానికి వెళ్ళాలో తెలిసిపోయేలా అన్నమాట!’
‘అబ్బ, సూపర్ సార్... అప్పుడు ఒకరి ఏరియాలోకి మరొకరు వెళ్ళి మనలో మనం గొడవలు పడకుండా ఉంటుంది’
‘ఆపైన మన నినాదం వైనాట్ 420’
‘అంటే ఏమిటి సార్?’
‘దొంగ అనేవాడు సమాజానికి ఎంత అవసరమో, దొంగల్లేకపోతే ఎంత ప్రమాదమో తెలిసేలా ప్రచారం చేద్దాం... పనిలో పనిగా మనం దొంగతనాలు చేయాల్సిన ఏరియాలన్నీ లెక్కపెట్టుకుందాం. ఇప్పుడు కొన్నే కదా మన అధీనంలో ఉన్నాయి- మొత్తం అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం’
‘అబ్బా... అప్పుడు డబ్బులే డబ్బులు సార్, అలా అన్ని ఏరియాలు మనకే వచ్చేస్తే నేనే ఓ కాలనీ కట్టుకుని అందులో చక్కగా చోరీలు చేసుకుంటా’
‘నేను కూడా అలాంటిదే ఆలోచిస్తున్నానయ్యా... ఇప్పుడున్న నాలుగైదిళ్లు దోచేసిన సొమ్ము దాయడానికే చాలడం లేదు... ఇంకా కొత్తగా ప్రాంతానికో ప్యాలెస్ కట్టుకోవాలి’
‘బ్రహ్మాండం సార్... వాటినిండా సొమ్ములు దాచుకుని జనానికి మాత్రం నెలకి రూపాయే తీసుకుంటున్నా అని చెప్పవచ్చు’
‘మరే, ఆ తరవాత మనం చేయాల్సింది- సామాజిక చోర యాత్ర!’
‘అంటే ఏమిటి సార్... బస్సులేసుకుని నేరుగా వీధుల్లో కనిపించింది కనిపించినట్టు ఎత్తేయడమేనా?’
‘ఛ...ఛ...మరీ అలా చేయకూడదయ్యా... ఇప్పుడున్న కేసులు చాలవా? ఇదంతా రెక్కీ కోసం...’
‘అయ్యా మీరు దేవుడయ్యా... కష్టపడి దాక్కుంటూ రెక్కీ చేసుకునే మాకు... అలా దర్జాగా బస్సులో వెళ్ళే అవకాశం కల్పించారా! ఇక చూడండి, ఏ ఇంట్లో ఎంత బంగారం ఉందో, ఏ దుకాణంలో ఎంత సొమ్ముందో చిత్రగుప్తుడిలా చిట్టాలు రాసుకొస్తాం... బెండకాయ నుంచి బెంజి కారు వరకు, ఇటుకముక్క నుంచి ఇనప్పెట్టె వరకు దేన్నీ వదలం!’
‘వెరీగుడ్, కొట్టేయాలనే నీ కసి నాకు బాగా నచ్చిందయ్యా... నీలాంటివాళ్లే కావాలి’
‘అయ్యో... పొగడకండి సార్, నాకసలే మా చెడ్డసిగ్గు!’
‘చివరిగా మనం చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం... వై యూ నీడ్ దొంగ’
‘ఇంకెందుకు... అన్నివిధాలా అడుక్కుతినడానికి!’
‘ఆ విషయం మనకు తెలుసు, వాళ్లకు తెలీదు కదా... అందుకే మనం ఎక్కడికక్కడ సభలు గట్రా పెట్టి జనాల్లో దొంగల పట్ల చైతన్యం తీసుకురావాలి. దేశానికి దొంగల అవసరాన్ని నలుదిక్కులా చాటాలి. ఈ దెబ్బకు దొంగల రాజ్యం పరిఢవిల్లాలి!’
‘సార్ మీరు ఫ్లోలో పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు, మళ్లీ నోరుతిరక్కపోతే పరువుపోతుంది, ఎందుకు రిస్కు’
‘సరే సరే... మీకు విషయం అర్థమైంది కదా!’
‘ఇక చూడండి చెడుగుడు ఆడేస్తాం! ఎప్పుడూ వాడని మీబుర్రలో ఇన్నిఆలోచనలు ఎలా పుట్టాయో అస్సలు అర్థం కావడం లేదు, కొంచెం చెప్పరా?’
‘ఆఁ నా బొంద... వేరేవాళ్లు చేస్తున్నవే ఏరుకొచ్చా...అంతే!’
‘అబ్బబ్బా... ఇది కూడా దొంగతనమే, మీరు మామూలువాళ్లు కాదు’
‘హ్హిహ్హిహ్హి... అలా పొగడకయ్యా, ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది!’
‘మీకు సిగ్గా... ఆఁ..!!!’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి!
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్‌లో ఉంటున్నారు: గౌతమ్‌కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
-
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత