గిరిజన ‘అందం’!

గిరిజన మహిళలంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది. వాళ్లు ఏదీ సాధించలేరన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ కేరళకు చెందిన అనుప్రసోభిని ఈ భావన తప్పని నిరూపిస్తోంది. అక్కడి ఇరుల అనే గిరిజన తెగకు చెందిన ఆమె.. తాజాగా ‘మిస్‌ కేరళ ఫిట్‌నెస్‌ అండ్‌ ఫ్యాషన్‌ 2021’ అందాల పోటీల తుది దశకు చేరుకొని అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా నిలిచింది.

Published : 24 Nov 2021 20:24 IST

(Photo: Instagram)

గిరిజన మహిళలంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది. వాళ్లు ఏదీ సాధించలేరన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ కేరళకు చెందిన అనుప్రసోభిని ఈ భావన తప్పని నిరూపిస్తోంది. అక్కడి ఇరుల అనే గిరిజన తెగకు చెందిన ఆమె.. తాజాగా ‘మిస్‌ కేరళ ఫిట్‌నెస్‌ అండ్‌ ఫ్యాషన్‌ 2021’ అందాల పోటీల తుది దశకు చేరుకొని అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా నిలిచింది.

అనుప్రసోభిని కేరళ పాలక్కడ్‌ జిల్లాలోని అట్టప్పడి అనే గిరిజన ప్రాంతంలో జన్మించింది. ప్రస్తుతం ఆమె అక్కడి గిరిజన హాస్టల్‌లో ఉంటూ 12వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే ఆమెకు మోడలింగ్‌ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆసక్తితో ‘మిస్‌ కేరళ ఫిట్‌నెస్‌ అండ్‌ ఫ్యాషన్‌ 2021’ పోటీల ఆడిషన్స్‌కు హాజరైంది. తన ప్రతిభతో తుది రౌండ్‌కు అర్హత సాధించింది.

వారిలో స్ఫూర్తి నింపాలని..!

‘తుది దశకు అర్హత సాధించిన 33 మంది అమ్మాయిల్లో నేనూ ఉన్నాను. వారిలో నేనొక్కదాన్నే గిరిజన అమ్మాయిని కావడం నాకు మరింత ప్రోత్సాహకరంగా అనిపించింది. ఎందుకంటే మా ప్రాంతపు అమ్మాయిల్లో నైపుణ్యాలున్నా వాటిని బయటి ప్రపంచానికి చాటడానికి తగిన ప్రోత్సాహం, సౌకర్యాలు కొరవడ్డాయనే చెప్పాలి. అందుకు నేనే ఉదాహరణ. కాలేజీలో నా నేపథ్యం గురించి చెప్పినప్పుడు కొంతమంది నన్ను, నా తెగను చులకన చేసి మాట్లాడేవారు. ఇలా వాళ్ల ఆలోచన తప్పని నిరూపించి, మా తెగకు చెందిన అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాలని, మార్గనిర్దేశనం చేయాలనుకున్నా..’ అంటోందీ గిరిజన మోడల్‌. ‘మిస్‌ కేరళ ఫిట్‌నెస్‌ అండ్‌ ఫ్యాషన్‌ 2021’ ఫైనల్‌ రౌండ్‌ పోటీలు డిసెంబర్‌లో జరగనున్నాయి.

మ్యూజిక్‌ లవర్‌!

17 ఏళ్ల అనుకు ‘Attappadykaari’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. దీని ద్వారా తన తెగకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది. భవిష్యత్తులో తాను మోడల్‌ అయినా.. మరోవైపు ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తానంటోంది.
‘నేను డ్యాన్స్‌, మ్యూజిక్‌ని ఇష్టపడతాను. అలాగే నటన అన్నా నాకు మక్కువే! ఈ క్రమంలోనే చిన్నప్పుడు మేకప్‌ వేసుకొని అద్దం ముందు నిల్చొని నటించేదాన్ని. నా తల్లిదండ్రులు కూడా నా ఇష్టాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. ప్రస్తుతం ధబరి కురివి అనే గిరిజన సినిమాలో నటించే అవకాశం వచ్చింది..’ అని చెప్పుకొచ్చిందామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్