చదువుకుంటూనే పెట్రోల్ ట్యాంకర్ నడుపుతోంది!
మహిళలు మానసికంగా బలవంతులే అయినా.. శారీరకంగా మాత్రం మగవారితో పోల్చితే బలహీనులే అన్నది చాలామంది భావన. అందుకే పురుషులు చేసే కొన్ని పనులు, ఉద్యోగాలు స్త్రీలు చేయలేరని అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, బస్సులు.. వంటి భారీ వాహనాలను మహిళలు అసలు నడపలేరనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అసత్యం, అవాస్తవం అని నిరూపిస్తోంది కేరళకు చెందిన 24 ఏళ్ల డెలిసియా డావిస్.
మహిళలు మానసికంగా బలవంతులే అయినా.. శారీరకంగా మాత్రం మగవారితో పోల్చితే బలహీనులే అన్నది చాలామంది భావన. అందుకే పురుషులు చేసే కొన్ని పనులు, ఉద్యోగాలు స్త్రీలు చేయలేరని అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, బస్సులు.. వంటి భారీ వాహనాలను మహిళలు అసలు నడపలేరనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అసత్యం, అవాస్తవం అని నిరూపిస్తోంది కేరళకు చెందిన 24 ఏళ్ల డెలిసియా డావిస్. కామర్స్‌లో పీజీ చేస్తోన్న ఈ యువతి ప్రమాదకరమైన పెట్రోల్ ట్యాంకర్‌ను అలవోకగా నడుపుతోంది. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాల్ని చూసి రవాణాశాఖ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘శెభాష్’ అంటూ ఆమెను అభినందిస్తున్నారు. మరి, ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పెట్రోల్ ట్యాంకర్ ఎందుకు నడుపుతోందో తననే అడుగుదాం రండి..
స్టీరింగ్ పట్టిందంటే దూసుకుపోవాల్సిందే!
మొన్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సీమాఠాకూర్ ఆర్టీసీ బస్సు నడిపితే.. నిన్న ఒడిశాకు చెందిన మోనాలిసా చీరకట్టులో లారీ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈక్రమంలో మహిళలకు సాధ్యం కాని పనేదీ లేదంటూ ఏకంగా పెట్రోల్ ట్యాంకర్‌నే నడుపుతోంది కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన డెలిసియా. ఒక్కసారి ట్యాంకర్ స్టీరింగ్ పట్టిందంటే ఏకబిగిన 300 కిలోమీటర్ల ప్రయాణమైనా అలవోకగా చేస్తూ రవాణా శాఖ అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తోందామె.
మూడేళ్ల నుంచి నడుపుతున్నా..!
మూడేళ్ల నుంచి పెట్రోల్ ట్యాంకర్ నడుపుతున్నప్పటికీ ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది డెలిసియా. లాక్డౌన్లో జాతీయ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ నడుపుతోన్న ఆమెను మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీల కోసం ఆపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆ యువతిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే తన హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు హజార్డస్ గూడ్స్ (ప్రమాదకరమైన వస్తువులు) లైసెన్స్‌ను తీసి చూపించింది డెలిసియా. ‘తనిఖీల కోసం నన్ను ఆపిన అధికారులు మొదట ఆశ్చర్యపోయారు. వెంటనే నేను లైసెన్స్ పత్రాలు చూపించడంతో అభినందించడం మొదలుపెట్టారు. కేరళలో ఇలా పెట్రోల్ ట్యాంకర్ నడుపుతోన్న ఏకైక మహిళను నేనేనంటూ మీడియాకు కూడా సమాచారం అందించారు. మూడేళ్లుగా ఈ ట్యాంకర్ నడుపుతున్న నా గురించి ఎవరికీ తెలియకపోవడం నాక్కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది’ అంటోందీ డేరింగ్ లేడీ.
3 సార్లు.. 300 కిలోమీటర్లు!
డెలిసియా తండ్రి డావిస్ కూడా 42 ఏళ్ల పాటు ఇదే పెట్రోల్ ట్యాంకర్‌కు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో తన తండ్రిని చూస్తూ పెరిగిన ఆమె సహజంగానే చిన్నప్పటి నుంచి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. కూతురు అభిరుచిని గుర్తించిన డావిస్ కూడా ఆమెను అన్ని రకాలుగా ప్రోత్సహించారు. ఈ క్రమంలో మొదట టూ వీలర్ డ్రైవింగ్ నేర్చుకున్న డెలిసియా.. 16 ఏళ్లకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ కూడా ఒంటబట్టించుకుంది. అయితే 20 ఏళ్లు వచ్చాక కానీ తనకు హెవీ వెహికల్ అండ్ హజార్డస్ గూడ్స్ లైసెన్స్ రాలేదు. ఈక్రమంలో మూడేళ్ల నుంచి కొచ్చి నుంచి మళప్పురానికి పెట్రోల్ ట్యాంకర్‌తో 300కిలోమీటర్లు ప్రయాణం చేస్తోందీ యంగ్ లేడీ. అది కూడా వారంలో 3సార్లు..!
అదే నా కల!
మరి, ఓవైపు పీజీ చదువుతున్నా మరోవైపు పెట్రోల్ ట్యాంకర్ ఎందుకు నడుపుతున్నావని డెలిసియాను అడిగితే.. డ్రైవింగ్‌పై తనకున్న ఆసక్తి, అభిరుచే అందుకు కారణమంటోంది. ‘నేను ఈ లారీకి క్లీనర్‌ని మాత్రమే. డ్రైవింగ్‌పై ఆసక్తి ఉండడంతో నాన్నకు చేదోడువాదోడుగా ఉండేందుకే ఇలా పెట్రోల్ ట్యాంకర్ నడుపుతున్నాను. నేను మూడేళ్ల నుంచి దీనిని నడుపుతున్నా. లాక్డౌన్ కావడంతో ప్రస్తుతం వారానికి కేవలం 3 ట్రిప్పులే వస్తున్నాయి. ఇంధనం నింపుకోవాల్సినప్పుడు తెల్లవారుజామున 2గంటలకే నిద్రలేస్తాను. ట్యాంకర్‌ను తీసుకుని 4గంటల కల్లా ఇరుంబనం చేరుకుంటాను. అక్కడ పెట్రోల్ నింపుకొని 9.30కల్లా తిరుచ్చి చేరుకుంటాను. ఆ తర్వాత ఇంధనాన్ని అన్లోడ్ చేసి తిరిగి ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం 3 అవుతుంది. సాయంత్రం నుంచి నా పీజీ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతాను. వోల్వో బస్సు నడపాలన్నదే నా కల. అందుకోసం లైసెన్స్ సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నా’ అని చిరునవ్వుతో చెబుతోందీ యంగ్ సెన్సేషన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!