Published : 29/06/2021 16:58 IST

తమ్ముడికే ఎందుకు? నాకెందుకు నేర్పించవు నాన్నా?

Photo: Instagram

క్రికెట్‌ ఇంగ్లండ్‌లో పుట్టినప్పటికీ ఇండియాలోనే ఎక్కువ క్రేజ్‌ తెచ్చుకుంది. గల్లీ నుంచి దిల్లీ వరకూ చాలామంది ఈ గేమ్‌ను ఆడడానికి, చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. మనదేశంలో ఈ ఆటకున్న పాపులారిటీని చూసి ఎంతోమంది అమ్మాయిలు కూడా క్రికెటర్లు కావాలని కలలు కంటున్నారు. ఎలాగైనా ఇండియన్‌ క్రికెట్‌ జెర్సీ ధరించడమే తమ జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ పురుషుల క్రికెట్‌కున్న ఆదరణ మహిళల క్రికెట్‌కు ఉండడం లేదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో కూడా మార్పు వస్తోంది. పురుషుల క్రికెట్‌ పోటీలతో పాటు మహిళల క్రికెట్‌ పోటీలను కూడా ఆసక్తిగా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మహిళల క్రికెట్‌ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు అమ్మాయిలు సైతం ముందుకు వస్తున్నారు. మిథాలీరాజ్‌, స్మృతీ మంధాన... తదితర క్రికెటర్లను స్ఫూర్తిగా తీసుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అలా వారి దారిలోనే ముందుకు సాగుతోంది కోజికోడ్‌కు చెందిన ఆరేళ్ల మెహక్‌ ఫాతిమా.

పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో!

ప్రముఖ క్రికెట్‌ కోచ్ బిజు జార్జ్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో బ్యాట్‌ పట్టుకుని బరిలోకి దిగిన ఆరేళ్ల మెహక్... పర్‌ఫెక్ట్ షాట్లతో, టైమింగ్‌తో ఆడుతూ కనిపించింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగ్స్‌ లాంటి ప్రముఖ క్రికెటర్లతో పాటు నెటిజన్లు మెహక్‌ ప్రతిభకు ముగ్ధులయ్యారు.

అందుకే నాకు క్రికెట్‌ నేర్పించడం లేదా?

ఫాతిమా క్రికెట్‌ ప్రస్థానం ఏడు నెలల క్రితమే మొదలైంది. తండ్రి మునీర్‌ తన మూడేళ్ల సోదరుడికి క్రికెట్‌లో మెలకువలు నేర్పించడాన్ని చూసి తాను కూడా ఆ గేమ్‌ నేర్చుకోవాలనుకుంది. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్లి ‘ అమ్మాయిని కాబట్టే నాకు క్రికెట్‌ నేర్పించడం లేదా నాన్నా?’ అని సూటిగా అడిగేసింది. దీంతో క్రికెట్‌పై తన కూతురుకి ఎంత ఇష్టముందో మునీర్‌కు అప్పుడే అర్థమైంది. వెంటనే కుమారుడితో పాటు ఆమెకు కూడా ఆటను ఎలా ఆడాలో నేర్పించడం మొదలుపెట్టాడు. అలా కొన్ని నెలల పాటు తండ్రి వద్ద క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంది మెహక్. ఈ క్రమంలో తాను క్రికెట్‌ ఆడుతున్నప్పటి ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో ఫాతిమా ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.

మూడు నెలల శిక్షణలోనే!

ఫాతిమా రక్తంలోనే క్రికెట్‌ ఉంది. ఆమె తండ్రి మునీర్ కాలికట్‌ యూనివర్సిటీ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఫాతిమా సోదరుడు ఏడాదిన్నర వయసు నుంచే క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకోవడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో మెహక్‌కు కూడా క్రికెట్‌ అంటే ఆసక్తి ఉండడంతో మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆమెను ఓ క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. అయితే లాక్‌డౌన్‌ విధించడంతో అర్ధాంతరంగా శిక్షణ ఆగిపోయింది. అయితే ఈ కొద్ది సమయంలోనే క్రికెట్‌లో ఎన్నో మెలకువలను నేర్చుకుంది ఫాతిమా. కచ్చితమైన టైమింగ్‌ అండ్‌ టెక్నిక్‌తో పదునైన షాట్లు ఆడడం అలవాటు చేసుకుంది.

స్మృతి స్ఫూర్తితో!

మెహక్‌కు భారత మహిళా క్రికెటర్‌ స్మృతీమంధాన అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తనలా గొప్ప క్రికెటర్‌ అవ్వాలనుకుంటోంది ఫాతిమా. ఈ ప్రయాణంలో ఫాతిమాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామంటోంది ఆమె తల్లి ఖదీజా. ‘నా కూతురు కేవలం మూడు నెలలు మాత్రమే క్రికెట్‌ అకాడమీలో గడిపింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో ఆ అకాడమీ మూతపడింది. అయితే ఆ తక్కువ సమయంలోనే ఫాతిమా అన్ని రకాల షాట్లు ఆడడం నేర్చుకుంది. ప్రస్తుతం తన ఆటతీరును చూసి పలు క్రికెట్‌ అకాడమీలు, శిక్షణ సంస్థలు ఆమెకు శిక్షణ ఇస్తామంటూ ముందుకొస్తున్నాయి. అయితే తను ప్రస్తుతం ఇంటి దగ్గరే తండ్రితో కలిసి ప్రాక్టీస్‌ చేస్తోంది. ప్రస్తుతం రెండో తరగతి చదివే ఫాతిమాకు స్మృతీమంధాన అంటే ఎంతో అభిమానం. ఎప్పుడూ ఆమె వీడియోలు చూస్తుంటుంది. పెద్దయ్యాక స్మృతిలా తాను కూడా గొప్ప క్రికెటర్‌ అవుతానంటూ మాతో చెబుతుంటుంది. అందుకు తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం’ అని మెహక్‌ తల్లి చెప్పుకొచ్చింది.


CLuVgKLAUQR

Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి