గర్భం రావాలంటే కలయికలో ఎప్పుడు పాల్గొనాలి?

హాయ్‌ డాక్టర్‌. నాకు పీసీఓఎస్‌, అధిక బరువు సమస్యలున్నాయి. మేం రెండో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాం. నేను గర్భం ధరించాలంటే ఏయే రోజుల్లో కలయికలో పాల్గొనాలి? (బర్త్‌ క్యాలిక్యులేటర్‌ని ఎలా కౌంట్‌ చేయాలి?)? సలహా ఇవ్వండి.

Updated : 21 Aug 2021 18:00 IST

హాయ్‌ డాక్టర్‌. నాకు పీసీఓఎస్‌, అధిక బరువు సమస్యలున్నాయి. మేం రెండో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాం. నేను గర్భం ధరించాలంటే ఏయే రోజుల్లో కలయికలో పాల్గొనాలి? (బర్త్‌ క్యాలిక్యులేటర్‌ని ఎలా కౌంట్‌ చేయాలి?)? సలహా ఇవ్వండి.

- ఓ సోదరి

జ: మీకు పీసీఓఎస్‌, అధిక బరువు సమస్యలున్నాయని రాశారు. ముందుగా బరువు తగ్గే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అధిక బరువు వల్ల పీసీఓఎస్‌ ఉన్నప్పుడు అండం విడుదల కానే కాదు. అటువంటప్పుడు ఏ రోజుల్లో కలిస్తే గర్భం వస్తుందనేది చెప్పడం కూడా వీలు కాదు. ఎందుకంటే నెలసరి సక్రమంగా రానప్పుడు, అండం విడుదల కానప్పుడు ఫలానా రోజుల్లో కలయిక జరిగితే గర్భం వస్తుందన్నది చెప్పలేం. అందుకే మీరు ముందుగా బరువు తగ్గి, నెలసరి సక్రమంగా వస్తూ ఉంటే (అంటే 28-30 రోజుల రుతుచక్రం అయితే).. గర్భధారణకు అనువైన రోజుల్లో అంటే నెల మధ్యలో 10-20వ రోజు వరకు రోజు విడిచి రోజు కలయికలో పాల్గొన్నప్పుడు గర్భం ధరించే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్