
జడ వేసుకోవాల్సిందే... సెల్ఫీలు దిగకూడదు!
(Image for Representation)
పదో తరగతి దాకా ఇష్టంతో యూనిఫాం వేసుకున్న అమ్మాయిలంతా.. ఇంటర్‌లోకొచ్చాక ‘హమ్మయ్య.. ఇప్పుడు మనకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు.. నచ్చినట్లుగా తయారవ్వచ్చు..’ అనుకోవడం సహజం. అయితే ఇలాంటి అమ్మాయిల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయి కొన్ని కళాశాలల యాజమాన్యాలు. ఫ్యాషనబుల్ దుస్తుల వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, దానికి అడ్డుకట్ట వేయాలంటే డ్రస్ కోడ్ ఉండాల్సిందే అంటూ వివిధ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. ఇక దీనికి తోడు అమ్మాయిల హెయిర్‌స్టైల్ విషయంలోనూ సరికొత్త నిబంధన తీసుకొచ్చింది బిహార్‌కు చెందిన ఓ మహిళా కళాశాల. జడ వేసుకోకుండా, జుట్టు విరబోసుకు రాకూడదు; కళాశాల ప్రాంగణంలో సెల్ఫీలు తీసుకోవడానికి వీల్లేదు.. అలా అయితేనే కాలేజీలోకి అనుమతిస్తామంటూ హుకుం జారీ చేసింది. హవ్వ.. ఇదేం విడ్డూరం..?! డ్రస్ కోడ్ సరే.. హెయిర్ స్టైల్, సెల్ఫీలపై కూడా నిషేధాలేంటని, ఈ నిబంధనలు తాలిబన్ల పాలనను గుర్తుకు తెస్తున్నాయని, ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని.. విద్యార్థినులు, విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.
సుందర్‌వతి మహిళా కళాశాల.. బిహార్ భాగల్‌పూర్‌లోని ఏకైక మహిళా కళాశాల ఇది. 1949లో స్థాపించిన ఈ కాలేజీకి న్యాక్ ‘ఎ’ గ్రేడ్ కూడా లభించింది. Tilka Manjhi Bhagalpur University అనుబంధంగా పనిచేస్తోన్న ఈ కళాశాల సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విభాగాల్లో UG, PG కోర్సుల్ని అందిస్తోంది. అయితే ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో భాగంగా సుమారు 1500 మంది అమ్మాయిలు ఈ కళాశాలలో ప్రవేశం పొందారు. వీరికి తొలిసారి డ్రస్ కోడ్ నిబంధనను ప్రవేశపెట్టిందీ కాలేజీ యాజమాన్యం.
నిబంధనల్లో ఏమేమున్నాయంటే..?!
ఇందుకోసం ప్రత్యేక కమిటీని వేసి మరీ తుది నిర్ణయానికొచ్చిన ఈ కళాశాల ప్రిన్సిపల్ ఆ డ్రస్‌కోడ్ నిబంధనలపై తాజాగా ఉత్తర్వులిచ్చారు. అందులో ఏముందంటే..! అమ్మాయిలంతా..
* రాయల్ బ్లూ కుర్తా వేసుకోవాలి.
* దీనికి జతగా తెలుపు రంగు సల్వార్, అదే రంగు దుపట్టా ధరించాలి.
* తెలుపు రంగు సాక్సులు, నలుపు రంగు షూస్ ధరించాలి.
* లూజ్ హెయిర్ కాకుండా.. ఒక జడ లేదా రెండు జడలు వేసుకొనే కాలేజీకి రావాలి.
* రాయల్ బ్లూ బ్లేజర్ ధరించాలి..
ఇలా అయితేనే కళాశాల లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాదు.. కాలేజీ ప్రాంగణంలో ఏ విద్యార్థినీ సెల్ఫీలు దిగడానికి వీల్లేదని కూడా కరాఖండిగా చెప్పేసింది. ఈ నిబంధనలన్నీ చూసిన విద్యార్థినులు అన్నింటికీ సమ్మతించినా.. జడ వేసుకోవాలన్న నిబంధనను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
రేగుతున్న ‘జడ’ దుమారం!
అయితే ఈ డ్రస్ కోడ్ నిబంధనలపై సుందర్‌వతి మహిళా కాలేజీ విద్యార్థినులే కాదు.. Tilka Manjhi Bhagalpur University అనుబంధ కళాశాలలన్నీ నిరసన తెలుపుతున్నాయి. ఆయా కళాశాలల విద్యార్థినులు, విద్యార్థి సంఘాలు.. డ్రస్ కోడ్ విధించడం వరకు సరే కానీ.. కచ్చితంగా జడ వేసుకొనే కాలేజీకి రావాలన్న నియమం మాత్రం సహేతుకం కాదని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనలు తాలిబన్ల అరాచక చట్టాన్ని పోలి ఉన్నాయనే వారూ లేకపోలేదు. దీన్ని వెంటనే ప్రిన్సిపల్ వెనక్కి తీసుకోవాలని, లేదంటే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇలా ఎప్పుడూ ప్రతిభ పరంగా వార్తల్లో నిలిచే ఈ కళాశాల ఈసారి డ్రస్ కోడ్ విషయంలో అందరి నోళ్లలో నానుతోంది.
డ్రస్ కోడ్.. ఎక్కడెక్కడ ఎలా?
బిహార్ కళాశాల జడ నిబంధన కొత్తగా ఉన్నా.. గతంలోనూ దేశవ్యాప్తంగా పలు డ్రస్ కోడ్ వివాదాలు వైరలయ్యాయి.
* ఫ్యాషనబుల్ దుస్తుల వల్లే అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో 2019లో హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు డ్రస్ కోడ్ నిబంధనను తీసుకొచ్చింది. ‘మోకాళ్ల కింది వరకు ఉన్న కుర్తీలనే ధరించాలి.. స్లీవ్స్ మోచేతుల వరకు ఉండాలి..’ అంటూ విద్యార్థినులకు సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై విద్యార్థినుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, తరగతుల్ని బహిష్కరించి ధర్నాకు దిగడం, ఇతర కాలేజీ విద్యార్థులు వీరికి మద్దతుగా నిలవడం, విద్యార్థి సంఘాలు కూడా వీరికి మద్దతు తెలపడంతో కాలేజీ యాజమాన్యం దిగొచ్చి ఈ వింత నిబంధనను వెనక్కి తీసుకుంది.
* మహిళలు ధరించే ఫ్యాషనబుల్ దుస్తుల వల్లే వారు అఘాయిత్యాల బారిన పడుతున్నారనేది చాలామంది భావన. అయితే ఈ క్రమంలోనే ఓ డ్రస్ కోడ్ అంటూ పెడితే వారు ఇలాంటి సంఘటనల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తపడచ్చంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినుల కోసం ప్రత్యేకంగా డ్రస్ కోడ్ నిబంధన అమలు చేస్తోంది. పొట్టిగా, బిగుతుగా ఉండే ఫ్యాషనబుల్ దుస్తులు కాకుండా మహిళా ఉపాధ్యాయులు చీర లేదంటే సల్వార్ సూట్‌లో రావాలని, పురుషులు ఫార్మల్ ట్రౌజర్స్, షర్ట్స్.. వంటివి ధరించాలని నియమం పెట్టింది. టీచర్లే పిల్లలకు రోల్ మోడల్స్ అని, వీళ్లు నిండుగా ఉన్న దుస్తులు ధరిస్తే అది చూసి పిల్లలూ చక్కటి డ్రస్సింగ్ అలవాటు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు అక్కడి విద్యాశాఖ చెబుతోంది.
* గుజరాత్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో పనిచేసే టీచర్లకు డ్రస్ కోడ్ నిబంధనను అమలు చేస్తోంది. 2014లోనే అక్కడి స్కూళ్లలో పనిచేస్తోన్న మహిళా టీచర్లు చీర లేదా చుడీదార్‌లోనే స్కూలుకు రావాలన్న కచ్చితమైన నిబంధనను తీసుకొచ్చింది. వారు జీన్స్, టీ-షర్ట్స్ వేసుకురావడం నిషిద్ధం. ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమించిన వారికి తమ జీతాల్లో కోత విధించనున్నట్లు అక్కడి విద్యాశాఖ ప్రకటించడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
* ఇక తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర సచివాలయంలో డ్రస్ కోడ్ నిబంధనను అమలు చేసి వార్తల్లోకెక్కింది. పురుషులు ఫార్మల్ చొక్కాలు, ఫార్మల్ ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలని.. అదే మహిళా ఉద్యోగులైతే చీర లేదా దుపట్టాతో కూడిన చుడీదార్, సల్వార్ కమీజ్ ధరించాలని స్ట్రిక్ట్ రూల్స్ విధించింది.
* సాధారణంగా ఏ దేశంలోనైనా ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడమనేది వాళ్ల మతాచారం ప్రకారం ఉన్న నిబంధన. ఇది స్కూలుకెళ్లే పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా వర్తిస్తుంది. అయితే కేరళలోని కోజికోడ్‌కు చెందిన ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ (ఎంఈఎస్) ఈ కఠినమైన నిబంధనను కాస్త సడలించి ఆ విద్యార్థినులకు వూరట కల్పించింది. ఈ సొసైటీలో భాగమై ఉన్న దాదాపు 150 విద్యాసంస్థల్లో చదువుకుంటోన్న ముస్లిం యువతులు ఇకపై హెడ్ వెయిల్ (తలను కవర్ చేసే స్కార్ఫ్ లాంటి క్లాత్) ధరించకుండానే తరగతులకు హాజరుకావచ్చని ప్రకటించింది. ఇప్పటికే జీన్స్, స్కర్ట్స్, లెగ్గింగ్స్, షార్ట్ టాప్స్.. వంటివి ఆయా క్యాంపస్‌లలో నిషిద్ధం. కానీ ఇప్పుడు తమ బుర్ఖాలో భాగంగా ధరించే హెడ్ వెయిల్ అవసరం లేదని నిబంధన జారీ చేయడంతో అక్కడి విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. కానీ కొందరు ముస్లిం మత పెద్దలు మాత్రం ఇది తమ మతాచారాలకు విరుద్ధంగా ఉందంటూ ఖండిస్తున్నారు.
ఉల్లంఘిస్తే జైలుకే!
మన దేశంలో డ్రస్ కోడ్ నిబంధనలపై కొన్ని సడలింపులున్నా.. కొన్ని ఇతర దేశాల్లో మహిళలు వేసుకొనే దుస్తుల విషయంలో సడలింపులు లేకపోవడమే కాదు.. వాటిని అతిక్రమిస్తే కఠినమైన శిక్షలు కూడా విధిస్తారట. ‘ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం)’ ప్రకారం అలాంటి కొన్ని దేశాలేంటో ఇప్పుడు చూద్దాం..
* సాధారణంగా డ్రస్ కోడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ముస్లిం దేశాలే. అక్కడి మహిళలకు స్వేచ్ఛగా జీవించడమే కాదు.. తమకు నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు కూడా లేదు. ఇలాంటి దేశాల్లో సౌదీ అరేబియా ముందు వరుసలో ఉంటుంది. శరీరంలో ఒక్క కళ్లు తప్ప మరే శరీర భాగాలూ బయటికి కనిపించకుండా అభయా (బుర్ఖా) ధరించడం అక్కడి నిబంధన.
* ఉగాండా దేశంలో మినీ స్కర్ట్స్ నిషిద్ధం. మోకాళ్ల పైకి ఉన్న మినీ స్కర్ట్స్ వేసుకున్న అమ్మాయిలను అరెస్ట్ చేయడం అక్కడ కామన్.
* ఉత్తర కొరియాలో మహిళలు ప్యాంట్లు వేసుకోవడం నిషేధం. ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే వారితో బలవంతంగా పనిచేయించడం, జరిమానా విధించడం.. వంటివి చేస్తుంటారు. అలాగే అక్కడి మహిళల జుట్టు కూడా పొడవుగా ఉండడానికి వీల్లేదు. రెండు నుంచి మూడు ఇంచుల పొడవు మాత్రమే ఉండాలి. రెండు వారాలకోసారి జుట్టును ట్రిమ్ చేయించుకోవాలన్న నియమం కూడా అక్కడ ఉంది.
* పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన ట్రౌజర్లు, అభ్యంతరకరమైన దుస్తులు ధరించడానికి సూడాన్‌లో అనుమతించరు. ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే వారిని అరెస్ట్ చేయడమే కాదు.. 40 కొరడా దెబ్బలు తినాల్సిందే! అయితే ఈ నిబంధనపై అక్కడి మహిళా హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం అక్కడ కామన్‌గా మారిపోయింది.
మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేలా డ్రస్సింగ్ ఉండాలి!
మహిళలు ఏ విధంగా డ్రస్ వేసుకోవాలి అనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. అది వాళ్ల కుటుంబ సంస్కృతి, ఆలోచనలు, వాళ్లకు అలవాటైన సంప్రదాయాలు, పద్ధతులకు అనుగుణంగానే ఉంటుంది. పట్టణం, పల్లెలు కలిసిపోయి ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్‌గా మారుతోన్న ఈ రోజుల్లో ఎవరు ఏ విధంగా డ్రస్ వేసుకోవాలనేది పూర్తిగా వారి ఇష్టాయిష్టాల ప్రకారం ఉంటుంది. అలాగే అమ్మాయిల డ్రస్సింగ్ ఫలానా విధంగానే ఉండాలనే నియమం ఎక్కడా లేదు. ప్రతి తరంలోనూ మారుతోన్న కొన్ని అలవాట్లు, పద్ధతులు, వాళ్లకు ఇష్టమైన ఫ్యాషన్లు.. వంటివన్నీ పుట్టుకురావడం సహజం. అయితే ఇక్కడ ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే.. ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎంపికను బట్టి, సౌకర్యానికి అనుగుణంగా డ్రస్ చేసుకుంటారు. కాకపోతే మనం ఉద్యోగాలు చేసేటప్పుడు గానీ, చదువుకునేటప్పుడు గానీ అక్కడున్న ఫార్మల్ వాతావరణానికి తగ్గట్లుగా ఒక పద్ధతంటూ ఉండడం సహజం. ఇలా వస్త్రధారణ అనేది ఆయా సందర్భాలకు తగినట్లుగా ఉంటుంది.
సాధారణంగా అది ఎక్కడైనా, ఎవరైనా పాటించేదే. ఇది ఎవరికి వారు డెవలప్ చేసుకునేదే తప్ప ఏదో ఒకటే సూత్రం అందరూ గుడ్డిగా పాటించరు. అది స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా.. అలాంటి ఫార్మల్ వాతావరణంలో అందరికీ ఒకే రకమైన వస్త్రధారణ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే.. విద్యార్థులు లేదా ఉద్యోగుల వ్యక్తిగత సౌకర్యంతో పాటు వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఏకరూపత ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ అంశం తెరమీదకొస్తుంది. నాకు నచ్చిన బట్టలు వేసుకోకపోతే నాకు స్వేచ్ఛ ఎక్కడుంది అనే భావన కూడా కొందరిలో ఉండచ్చు. కేవలం మనం యూనిఫాంగా ఉండే బట్టలు వేసుకొని వెళ్లడం వల్ల మనకు స్వేచ్ఛ లేదు అనే అభిప్రాయం కూడా ఎంత వరకు సమంజసమో ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి. ఏదేమైనా చదువు, ఉద్యోగం.. ఇలా మనం ఏ లక్ష్యంతోనైతే ఆ ఫార్మల్ వాతావరణంలోకి వెళ్తున్నామో ముఖ్యంగా ఆ లక్ష్యాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటూ అందరూ ఈ వస్త్రధారణ పాటించడం మంచిది.
ఇక అమ్మాయిలు వేసుకునే డ్రస్సింగ్ వల్లే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనడం ఆమోదయోగ్యం కాదు. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒంటినిండా బట్టలున్నా సరే.. చూసే వారి కళ్లకు స్త్రీ ఒక భోగ వస్తువులాగా కనిపిస్తే వారు కేవలం లైంగిక వాంఛతోనే చూస్తారు. అలాగని ఇంకొకరి దృష్టిని అదుపు చేయడం కూడా మన చేతుల్లో లేదు. అది వారి ఆలోచనలకు, మనసుకు, వారి వివేకానికి వదిలేయాల్సిందే! కాకపోతే మన వైపు నుంచి మనం మనకు నచ్చేట్లుగా, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకునేట్లుగా డ్రస్సింగ్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకునే దుస్తులు మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలే తప్ప వాటి వల్లే అందమొస్తుందనో, అసభ్యత వస్తుందనో అనుకోవక్కర్లేదు. మనం వేసుకున్న దుస్తులు మన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేవిగా ఉన్నాయా, లేక తగ్గించేవిగా ఉన్నాయా అనేది మనం వ్యక్తిగతంగా నిర్ణయించుకుంటామే తప్ప ఇతరులు నిర్ణయించేది కాదు. అలాగే ఇంకొకరి దృష్టిలో లోపానికి కేవలం మనం, మన డ్రస్సింగే కారణం అని ఏ ఆడపిల్లా తనని తాను కించపరచుకోవక్కర్లేదు. తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని తాను కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి.
రెండింటినీ బ్యాలన్స్ చేయాలి!
డ్రస్సింగ్ అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమైన విషయం. అది మగవాళ్త్లెనా, ఆడవాళ్త్లెనా.. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిగత స్త్టెల్, కంఫర్ట్ జోన్ అనేవి ఉంటాయి. అలాగే వాళ్ల శరీరాకృతి (సెల్ఫ్ ఇమేజ్)ని బట్టి ప్రతి వ్యక్తి నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది.. ఈ బట్టల్లో నేను నిండుగా ఉన్నానా, ఫ్యాషనబుల్‌గా ఉన్నానా, సందర్భానికి తగినట్లుగా ఉన్నానా.. అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం. అయితే ఇలా అనుకున్నప్పటికీ కూడా మనందరం ఒక సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ప్రదేశానికి ఒక కచ్చితమైన వస్త్రధారణ అనేది ఉంటుంది. ఉదాహరణకు స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్ వేసుకొనే దిగాలి.. అలా ఆ పూల్‌కి సంబంధించిన ఒక కచ్చితమైన డ్రస్ కోడ్ అది. అలాగే గుడికి వెళ్లేటప్పుడు ఒక ట్రెడిషనల్ డ్రస్ వేసుకుంటాం.. ఇవన్నీ మనకు ఎవరు నేర్పిస్తారు.. మనం ఉండే సంస్కృతిని బట్టి ఆయా సందర్భాలకు తగినట్లుగా ఉండాలనే విషయం మనంతట మనకే తెలుస్తుంది. ఇలాంటి సంస్కృతి విద్యా సంస్థలు, ఆఫీసుల్లోనూ ఉంటుంది. ప్రతి సంస్థకూ ఏదో ఒక డ్రస్ కోడ్ ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ తమ నిబంధనలను బట్టి ఒక డ్రస్ కోడ్ పెట్టినప్పుడు దాన్ని మనం గౌరవిస్తూ మన హద్దుల్లో మనం ఉండడమనేది తప్పనిసరి. అలాగని అందులోనూ వారు లేనిపోని నిబంధనలు పెడితే అది మూర్ఖత్వమే అవుతుంది.
నిబంధనల పేరిట ఒకరి పర్సనల్ స్త్టెల్‌ని నొప్పించకూడదు.. అలాగని పది మందితో కలిసి పనిచేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ‘వ్యక్తిగతంగా నాకు నచ్చిందే చేస్తా’ అని ఆ వాతావరణానికి తగ్గట్లుగా కాకుండా అనుచితంగా డ్రస్సింగ్ చేసుకోవడం కూడా సరికాదు..
ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉండడం అనేది ముఖ్యమే. కానీ ఆయా సందర్భాన్ని బట్టి బ్యాలన్స్‌డ్‌గా ఉండాలి, పరిమితుల్లో ఉండాలి అనేదే ఇక్కడ ప్రధానం. బట్టలు వేసుకునేదాన్ని బట్టే అరాచకాలు జరుగుతాయి, డ్రస్సింగ్ సెన్స్‌ని బట్టే పెళ్లి సంబంధాలు కుదురుతాయి అనేది కరక్ట్ కాదు. కొందరు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నా వారికి చక్కగా నప్పుతాయి.. మరికొందరికి ట్రెడిషనల్ దుస్తులు సూటవుతాయి. ఇలా మనం వేసుకునే డ్రస్ ఏదైనా సరే.. దానివల్ల మనం నిండుగా, హుందాగా కనిపిస్తున్నామా? లేదా అనేదే ముఖ్యం.
- డా. కవిత గూడపాటి, ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
కాలేజీలోనైనా, ఆఫీసులోనైనా యాజమాన్యం డ్రస్ కోడ్ పెట్టడం అనేది సరైనదే కావచ్చు.. అలాగని ఆ నిబంధనల్ని మరింత కఠినతరం చేసి.. జడే వేసుకోవాలి.. సెల్ఫీలు దిగకూడదు.. అంటూ మహిళల స్వేచ్ఛను హరించడం, వారిని అవమానించడం మాత్రం సమంజసం కాదనేది చాలామంది భావన. మరి, ఇంతకీ డ్రస్ కోడ్ ఉంటేనే మహిళల గౌరవం నిలబడుతుందా? వారిపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందా? అసలు డ్రస్ కోడ్ పెట్టడం సరైన పద్ధతా? కాదా? ఈ విషయంపై మీరేమంటారు? మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోండి. ‘డ్రస్ కోడ్ డిబేట్’లో పాలుపంచుకుంటూ.. ఈ విషయంపై అందరిలో అవగాహనను మరింతగా పెంచండి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

Notice Period: ఉద్యోగం మానేస్తున్నారా?
కంపెనీ మారాలనుకున్నా, కెరీర్లో విరామం తీసుకోవాలనుకున్నా.. ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజం. ఈ క్రమంలో సంస్థ నిబంధనల ప్రకారం నోటీస్ పిరియడ్‌లో భాగంగా ఉద్యోగి ఒకటి లేదా రెండు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఎలాగూ కంపెనీ నుంచి.....తరువాయి

ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
నేనో వెబ్ డిజైనర్‌ని. కొవిడ్ వల్ల ఉద్యోగం పోయింది. ఏడాదికిపైగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నా. సంపాదనా బాగుంది. నా పని మెచ్చి ఎందరో రిఫరెన్సులూ ఇస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో కంటే రెట్టింపు సంపాదిస్తున్నా. నాకు నచ్చిన వీణను వాయిస్తున్నా. చిన్నచిన్న ప్రదర్శనలిస్తున్నా.తరువాయి

కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
కొత్తగా పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు.. కొత్త కోడలిగా అత్తింట్లో ఎలా మసలుకోవాలి? వాళ్ల మనసులు ఎలా గెలుచుకోవాలి? భర్తకు మరింత దగ్గరవడమెలా?.. నవ వధువుల మనసంతా ఇలాంటి విషయాల చుట్టే తిరుగుతుంటుంది. ఇలా వీళ్ల మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికే.....తరువాయి

పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
నా వయసు 24. మా పెద్దనాన్నగారికి భార్యా, పిల్లలు లేరు. తనకున్న ఇంటి స్థలాన్ని నా పేర రాస్తానంటున్నారు. ఇది వీలునామా ద్వారా రాయించుకోవాలా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? లేదంటే నన్ను ఆయన దత్తత తీసుకోవాలా? భవిష్యత్తులో ఎలాంటి చిక్కులూ లేకుండా మంచి మార్గాన్ని సూచించగలరు....తరువాయి

Entrepreneurship: సిబ్బందిలో ఇలా ప్రేరణ కలిగించండి!
బిజినెస్ అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయం. ఎదురయ్యే ప్రతి సమస్యను సమర్థతతో, సమయస్ఫూర్తితో పరిష్కరించాలి. మనకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగిస్తూ లాభాలు రాబట్టే వారే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అవుతారు. ఈ క్రమంలో బిజినెస్‌లో ఉండే అతి పెద్ద ఛాలెంజ్....తరువాయి

ఒత్తిడిని తరిమికొట్టేయొచ్చు...
ఒత్తిడి... మూడక్షరాల పదమే కానీ తెగ కలవరపెడుతుంది. మామూలు అనారోగ్యమైతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలా కాదు, అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది. శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి ఒత్తిడితో బాధపడే బదులు దాన్నెలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం...తరువాయి

Yoga Day : అందుకే ‘నవ్వు’తూ యోగా చేసేద్దాం!
ఎలాంటి అనారోగ్యాన్నైనా, మానసిక సమస్యనైనా దూరం చేసే శక్తి యోగాకు ఉందనడం అతిశయోక్తి కాదు. అందుకే చాలామంది తాము చేసే రోజువారీ వ్యాయామాల్లో భాగంగా యోగాను చేర్చుకుంటుంటారు. అయితే ఇందులోనూ ఎన్నో యోగా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. లాఫ్టర్ యోగా అలాంటిదే! ఇది నవ్వుతూ....తరువాయి

మీలో ఈ నైపుణ్యాలున్నాయా..
గీతిక డిగ్రీ చేసింది. మంచి విద్యార్థి కదా.. తన మార్కులకు తగ్గట్టుగానే ఉద్యోగానికి పిలుపులూ వస్తున్నాయి. వచ్చిన చిక్కల్లా ఎంపికవ్వకపోవడమే. మంచి మార్కులు, సబ్జెక్టుపై పట్టున్నా ఎందుకిలా అని మదనపడుతోంది. కొలువుకి ఇవే సరిపోవంటున్నారు నిపుణులు. ఇంకా ఏం కావాలో చెబుతున్నారిలా..తరువాయి

తండ్రి గొప్పతనాన్ని చాటాలనుకుంది!
అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. వేలు పట్టి నడిపించి, విద్యాబుద్ధులు నేర్పించి తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. మనం ఒక్కో మెట్టు ఎక్కుతుంటే తానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఆనందాన్ని పొందుతాడు. అలా ఎదిగే క్రమంలో పొరపాటున తప్పటడుగు వేస్తుంటే దండించైనా....తరువాయి

Guinness World Records: ఐదేళ్లకే పుస్తకం రాసేసింది!
‘ఆసక్తి ఉన్న అంశాల్లో పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ ఈ విషయం మరోసారి రుజువైంది. ఇందుకు తాజా ఉదాహరణే.. యూకేకు చెందిన బెల్లా జే డార్క్. ఐదేళ్ల వయసున్న ఈ అమ్మాయి తన సృజనాత్మక ఆలోచనలతో ఓ పుస్తకం రాసింది. అంతేకాదు.. ఆ కథకు తగ్గట్లుగా తన చిట్టి చేతులతో అందంగా....తరువాయి

ఆరోగ్యమంతా ‘పుస్తకం’లోనే ఉందంటున్నారు!
‘మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది’ అంటోంది బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ మలైకా అరోరా. పోషకాహారం తీసుకుంటే మన శరీరంలోని ఎన్నో అనారోగ్యాల్ని తరిమికొట్టచ్చంటోంది. ఆరోగ్యం-ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఇందుకోసం తాను పాటించే చిట్కాల్ని సోషల్ మీడియాతరువాయి

Prathyusha Suicide: అలా అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి.. ఆలోచించండి!
సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. అయితే కొంతమంది వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడి, ఆందోళనల్లోకి కూరుకుపోతుంటారు. ‘ఇక నా జీవితం వ్యర్థం!’ అన్న వైరాగ్య భావనలోకి వెళ్లిపోతారు. ఇలాంటి ఆలోచనలు ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా....తరువాయి

ఆస్తి తీసుకున్నారు.. బాధ్యత మరిచారు!
మా అత్తమామలకు ఇద్దరు అబ్బాయిలు. మా మామయ్య చనిపోక ముందు తన స్వార్జితం రెండు ఎకరాల పొలాన్ని మా బావగారికి 2002లో రాశారు. అందులో మావారికి వాటా ఇవ్వలేదు. మావారూ అప్పుడు అడ్డు చెప్పలేదు. మా అత్తమామలు మొదట్నుంచీ మా దగ్గరే ఉండేవారు. ఇప్పటికీ అత్తయ్య మా దగ్గరే ఉంటున్నారు. ఆమెకు 85 ఏళ్లు. మా బావగారు గతేడాది మరణించారు. ఆయన ఉన్నప్పుడూ తల్లి బాగోగులు చూసుకోలేదు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు...తరువాయి

Back To Work: ఇలా చేస్తే కెరీర్లో మళ్లీ రాణించచ్చు!
అనామిక ఎనిమిది నెలల బాబుకు తల్లి. డెలివరీకి ముందు వరకు ఓ ఐటీ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేసిన ఆమెను.. ప్రసవానంతర సెలవు అనంతరం ఏవేవో కారణాలు చెప్పి సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. సాధన తల్లిదండ్రులు, అత్తమామలు ముసలి వాళ్లు. ఓ చంటి బిడ్డకు తల్లైన ఆమె.. పాపాయిని వాళ్లకు అప్పగించే.....తరువాయి

ఉద్యోగానికి వెళుతూనే...
విమల ఇద్దరు పిల్లలకు అన్నీ చేసి మరీ అత్తగారికి అప్పగించి వెళుతుంది. సాయంత్రం వచ్చాక మళ్లీ వారి బాధ్యతలను తనే చూసుకుంటుంది. అయినా సరే... ఆ, ఉద్యోగం చేసే వాళ్లకు పిల్లలను పెంచడం ఎలా కుదురుతుందిలే అనే బంధువుల వ్యాఖ్యలు ఆమెను బాధిస్తుంటాయి. దాంతో తను సరిగ్గా చేయలేకపోతున్నానా అని ఆందోళనపడుతూ ఉంటుంది. అవేవీ పట్టించుకోవద్దు... ఉద్యోగం చేస్తూనే పిల్లలను చక్కగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు నిపుణులు.తరువాయి

మీ బ్రాండ్ విలువ పెంచుకోండి..!
మాట్లాడకూడదు, మన పని మాత్రమే మాట్లాడాలి.. అనుకుంటారు చాలామంది మహిళలు. పై అధికారులే తమ పనిని గుర్తించి పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఇస్తారనుకుంటారు. ఇలా అనుకోవడమే ‘టియారా సిండ్రోమ్’. ఈ సిండ్రోమ్ కారణంగానే చాలామంది కెరియర్లో వెనకబడుతున్నారు. దీన్ని అధిగమించడానికి నిపుణులు చెప్పే సూచనలేంటంటే...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- బామ్మల చిట్కా పాటిస్తారా?
- అంతరిక్ష ప్రేమికుల కోసం..
- Artificial Jewellery: ఆ అలర్జీని తగ్గించుకోవాలంటే..!
- దిష్టి తాడుకు.. నయా హంగు!
- వయసును దాచేద్దామా...
ఆరోగ్యమస్తు
- పొరపాటు చేస్తున్నారేమో..!
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
అనుబంధం
- సారీతో నేర్పించొచ్చు
- బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!
- పండంటి జీవితానికి పంచ సూత్రావళి
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- వేధింపులకు గురవుతున్నారేమో..
యూత్ కార్నర్
- అలుపు లేదు... గెలుపే!
- కోట్ల మందిని నవ్విస్తోంది
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
'స్వీట్' హోం
- పిల్లలు తక్కువ బరువుంటే..
- మొక్కలకు ఆహార కడ్డీలు..
- Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!
- వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
- ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు