నాన్నకు ప్రేమతో..!

నాన్న...పండక్కి పాత చొక్కా అయినా వేసుకుంటారు. కానీ, తన ముద్దుల కూతురికి మాత్రం పూల గౌను ఉండాల్సిందే. తను వెళ్లేది సైకిల్‌మీద అయినా సరే... గారాలపట్టి కాళ్లకు మువ్వల పట్టీలు ఉండి తీరాల్సిందే.

Published : 16 Jun 2024 04:11 IST

నాన్న...పండక్కి పాత చొక్కా అయినా వేసుకుంటారు. కానీ, తన ముద్దుల కూతురికి మాత్రం పూల గౌను ఉండాల్సిందే. తను వెళ్లేది సైకిల్‌మీద అయినా సరే... గారాలపట్టి కాళ్లకు మువ్వల పట్టీలు ఉండి తీరాల్సిందే. అంతగా మనల్ని ప్రేమించే నాన్నకు ఏమివ్వగలం? కానీ, చంద్రునికో నూలుపోగులా చిరు కానుకలు నాన్నకు ఇచ్చి మీ ప్రేమను తెలియజేయండి.

ఫొటోతో వ్యాలెట్‌...

నాన్నకు నచ్చే రంగు చొక్కా, వాచ్, బెల్ట్, కీచెయిన్, పర్‌ఫ్యూమ్‌... లాంటి వస్తువులన్నింటినీ ప్యాక్‌ చేయించి, దానిమీద మీకు నచ్చిన కోట్, ఫొటోలను ప్రింట్‌ చేయించొచ్చు.

చెక్క పాచికలు...

ఎంత ఫోన్లూ, టీవీలూ ఉన్నా అచ్చం అవే చూడాలంటే బోర్‌ కదా! అందుకే రిటైర్‌ అయిన తండ్రులైతే కొంత సమయమూ దొరుకుతుంది. కాబట్టి, సరదాగా సాయంకాలాల్లో తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వీలుగా ఈ ‘వుడెన్‌ డైస్‌ బ్లాక్స్‌’ను గిఫ్ట్‌గా ఇవ్వండి. 

కాఫీ కౌచ్‌ హోల్డర్‌తో..

పనిచేసుకుంటున్నప్పుడో లేదా సరదాగా సినిమా లాంటివి చూసేటప్పుడో అన్నీ వస్తువులు దగ్గరగా ఉండాలనుకుంటారు నాన్నలు. అందుకే, ఫోన్, స్నాక్స్, టీకప్, రిమోట్‌.. వంటివన్నీ అందుబాటులో ఉండేలా ‘కౌచ్‌ కప్‌ హోల్డర్‌’తోపాటు, మెత్తగా ఉండే షూస్, స్లిప్పర్లు కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్