చక్రం తిప్పేస్తోంది!

ఆమె సాధారణ కూలీ. గతంలో ద్విచక్ర వాహనం నడిపిన అనుభవం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా భారీ సాయిల్‌ కంప్యాక్టర్‌ వాహనాన్నే నడిపేస్తోంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే...

Updated : 15 Jun 2024 17:28 IST

ఆమె సాధారణ కూలీ. గతంలో ద్విచక్ర వాహనం నడిపిన అనుభవం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా భారీ సాయిల్‌ కంప్యాక్టర్‌ వాహనాన్నే నడిపేస్తోంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే...

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని జి.పెదపూడిలంక సమీపంలో గోదావరి నదీపాయపై భారీ వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో కూలి పనులు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాకు చెందిన ఓర్సు సంగీత తన భర్త బంగారంతో కలిసి నాలుగు నెలల క్రితం ఇక్కడకు వచ్చింది. అప్పుడే ఈ వంతెన నిర్మాణ పనులు పరిశీలించేందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భారీ వాహనాలను పురుషులే కాకుండా మహిళలు కూడా డ్రైవ్‌ చేసేలా ప్రోత్సహించాలనీ, అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని సూచించారు. దాంతో కాస్త చురుగ్గా ఉన్న సంగీతను సాయిల్‌ కంప్యాక్టర్‌ నడిపేందుకు ప్రోత్సహించి, శిక్షణ ఇచ్చారు. సంగీత పదిహేనురోజుల వ్యవధిలో శిక్షణ పూర్తిచేసుకుని సాయిల్‌ కంప్యాక్టర్‌ మెషీన్‌ (భారీవాహనం)ను సునాయాసంగా నడిపేస్తోంది. వంతెన నిర్మాణంలో భాగంగా మట్టిని పోసినపుడు సాయిల్‌ కంప్యాక్టర్‌తో రోలింగ్‌ చేయాలి. ఇలా చేయటం ద్వారా మట్టి గట్టిపడి ఇతర నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. మున్ముందు మరిన్ని భారీ వాహనాలను నడిపే సామర్థ్యాన్ని సాధిస్తానంటోంది సంగీత.

అడ్డగళ్ల భగత్‌సింగ్‌, పి.గన్నవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్