ఆమె... వ్యూహం!

‘మహిళా ఓటర్లకేం కావాలి?’ భారత్‌ అయినా, అమెరికా అయినా ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల వేళ కీలకంగా మారుతున్న ప్రశ్న ఇదే. దీనికి సమాధానం తెలిసిన పార్టీకి దాదాపుగా విజయం దక్కినట్టే. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ప్రెసిడెంట్‌ అభ్యర్థి ట్రంప్‌ కూడా మహిళా ఓట్‌ బ్యాంకుని ఆకట్టుకొనే పనిలో ఉన్నారు.

Published : 04 Jul 2024 03:14 IST

‘మహిళా ఓటర్లకేం కావాలి?’ భారత్‌ అయినా, అమెరికా అయినా ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల వేళ కీలకంగా మారుతున్న ప్రశ్న ఇదే. దీనికి సమాధానం తెలిసిన పార్టీకి దాదాపుగా విజయం దక్కినట్టే. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ప్రెసిడెంట్‌ అభ్యర్థి ట్రంప్‌ కూడా మహిళా ఓట్‌ బ్యాంకుని ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ మేనేజర్‌నీ నియమించుకున్నారు. ఆమె పేరు కెలియానే కాన్వే. ఏమిటి ఆమె గొప్పతనం అంటారా?

ఆధునిక రాజకీయాల్లో కొత్త పాత్రలు చాలానే ఉంటున్నాయి. అందులో క్యాంపెయిన్‌ మేనేజర్ల పాత్రా కీలకమే. 2016 ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు వెనక కీలకంగా ఉన్న మహిళ కెలియానే.
గెలిచింది ట్రంపే అయినా గెలిపించింది కెలియానే అంటారు రాజకీయ నిపుణులు. ఎన్నికల వ్యూహకర్తగా, పోల్‌స్టర్‌(ఒపీనియన్‌ పోల్‌) విశ్లేషకురాలిగా ఎంతో పేరుంది. ఆమె రాజకీయ జోస్యం చెబితే తప్పదంటారు. అలాగని ఆమె రాజకీయ కుటుంబంలో పుట్టిందనుకుంటే పొరపాటు. న్యూజెర్సీలో పుట్టిన ఆమె తండ్రి ఓ ట్రక్‌ డ్రైవర్‌. కెలియానే రెండేళ్ల పసిపాపగా ఉన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్లిపోతే తల్లి కాసినోల్లో పనిచేస్తూ పెంచింది. అమ్మమ్మ, ఇద్దరు పిన్నుల సమక్షంలో పెరిగిన కెలియానే హైస్కూల్‌ రోజుల్లో రాజకీయ నాయకుల ప్రసంగాలు ఆకర్షించాయి. అలా రాజకీయాలపై ఆసక్తిని పెంచుకుంది. బ్లూబెర్రీ పండ్లు ఏరుతూ అవి అమ్మగా వచ్చిన ఆదాయంతో చదువుకుంది. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న కెలియానో నేరుగా రాజకీయాల్లో పాల్గొనడం కన్నా వెనక వ్యూహాలు సిద్ధం చేయడంలోనే నిమగ్నురాలైంది. ఇందుకోసం ‘ఉమెన్‌ ట్రెండ్‌- ది పోలింగ్‌ కంపెనీ’ అనే సంస్థను స్థాపించింది. వాట్‌ ఉమెన్‌ రియల్లీ వాంట్‌ అనే పుస్తకాన్నీ రాసింది. నలుగురు పిల్లల తల్లి. కెలియానే వ్యూహం వేస్తే ట్రంప్‌ గెలుపు ఖాయం అంటున్నారు ఆమె సత్తా తెలిసినవాళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్