డాడీకీ సెలవిస్తున్నారు..!

ప్రసూతి అంటే... అది స్త్రీల బాధ, పిల్లల సంరక్షణ తల్లి బాధ్యత అనుకునే రోజులు కావివి. మారిన పరిస్థితుల దృష్ట్యా డెలివరీ సమయానికి లేబర్‌ వార్డులో ఉండటమే కాదు... పసివాళ్ల సంరక్షణా తమదే అంటున్నారు నేటితరం నాన్నలు.

Published : 16 Jun 2024 04:13 IST

ప్రసూతి అంటే... అది స్త్రీల బాధ, పిల్లల సంరక్షణ తల్లి బాధ్యత అనుకునే రోజులు కావివి. మారిన పరిస్థితుల దృష్ట్యా డెలివరీ సమయానికి లేబర్‌ వార్డులో ఉండటమే కాదు... పసివాళ్ల సంరక్షణా తమదే అంటున్నారు నేటితరం నాన్నలు. అందుకే వారికీ ప్రసూతి సెలవుల్ని ఇవ్వడానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు ముందుకు వచ్చాయి.

న దేశంలో సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌-1972 40(సి)ప్రకారం బిడ్డ జన్మించిన లేదా దత్తత తీసుకున్న ఆరు నెలలలోపు 15 రోజుల పితృత్వ సెలవులు వినియోగించుకునేందుకు పురుషులు అర్హులు. సిక్కింలో మాత్రం ఒక నెల ఈ పెటర్నిటీ లీవ్స్‌ని మంజూరు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ 6 వారాలు, టీసీఎస్‌ 15 రోజులు, విప్రో 8 వారాలు, జొమాటో 26 వారాలు, ఇన్ఫోసిస్‌ 5 రోజులూ ప్రసూతి సెలవుల్ని ఇస్తున్నాయి.

ఇతర దేశాల్లో ఎలా...

  • పెయిడ్‌ పేరెంట్‌ లీవ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం స్వీడన్‌. 1974 నుంచే ఈ చట్టం అమలులో ఉంది. కానీ, 1995 నుంచి మాత్రమే తండ్రులు మూడు నెలలు సెలవు తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. వీటినే ‘డాడీ మంత్స్‌’గా పిలుస్తారు.  
  • ఫిన్లాండ్‌ తల్లిదండ్రులిద్దరికీ కలిపి పద్నాలుగు నెలల సెలవుని అందిస్తోంది. తల్లిదండ్రులిద్దరూ చెరో ఏడు నెలలు తమ బిడ్డలతో గడపొచ్చు.
  • లిథువేనియాలో వందశాతం జీతంతో పెయిడ్‌ లీవ్‌ని ఏడాది పాటు తీసుకోవచ్చు. మరో రెండేళ్లు సెలవుల్ని పొడిగించుకోవచ్చు. అయితే, అప్పుడు వేతనంలో 70శాతం చెల్లిస్తారు.
  • జపాన్, దక్షిణ కొరియాలో తండ్రులు సంవత్సరం వరకు షేర్డ్‌ లీవ్‌ తీసుకోవచ్చు. మొదటి 6 నెలలకు 67శాతం జీతం, తదుపరి 6 నెలలకు 50శాతం శాలరీ లభిస్తుంది.
  • స్పెయిన్, నెదర్లాండ్స్‌... 16 వారాలపాటు పితృత్వ సెలవులతో పాటు ఆ సమయంలో వందశాతం జీతం చెల్లిస్తున్నాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్