Mrunal Thakur: బలహీనతని దాయొద్దు!

‘ఇక నా వల్ల కాదు..’ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు ఇలా తప్పక అనిపిస్తుంది. కానీ పక్కవాళ్లతో పంచుకోవాలంటే భయం. ఎక్కడ బలహీనుల కింద లెక్కేస్తారోననే జంకు.

Published : 04 Apr 2023 00:44 IST

మృణాల్‌ ఠాకూర్‌, నటి

‘ఇక నా వల్ల కాదు..’ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు ఇలా తప్పక అనిపిస్తుంది. కానీ పక్కవాళ్లతో పంచుకోవాలంటే భయం. ఎక్కడ బలహీనుల కింద లెక్కేస్తారోననే జంకు. ఓటమి ఎదురైన వారిదే ఈ పరిస్థితి అనుకుంటాం కానీ.. గెలిచిన తర్వాతే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఒక్కో అడుగూ ముందుకు పడుతున్న కొద్దీ పెరిగిన అంచనాలతో తెలియని ఒత్తిడి, భారం భుజాలపైకి చేరుతుంది. అయినా వీటన్నింటినీ చిరునవ్వు మాటున దాచేవారే ఎక్కువ. ఇప్పటితరం కూడా తమలోని సానుకూల అంశాలనే చూపించాలని తాపత్రయపడుతుంది. అందుకే ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్న ముఖాన్నీ, సరదాలూ, సంతోషాలనూ మాత్రమే నలుగురితో పంచుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు. బాధైనా, సంతోషమైనా ముఖంపై దాయలేను. అందుకే నా బలహీనతనీ ధైర్యంగా పంచుకోగలను. ఏ భావోద్వేగమైనా ఆ క్షణమే! కాసేపటికి తిరిగి మామూలైపోతా. ఎవరి పరిస్థితైనా అంతే.. బాధని లోపల దాచిపెడితేనే సమస్య. బయటకు రానిస్తే.. మనసు తేలిక పడుతుంది. తిరిగి మరింత శక్తిని పుంజుకుంటాం. కాబట్టి.. యువతకు నేను చెప్పేదొకటే! కఠినశ్రమ, ఎదురయ్యే అడ్డంకులను దాటుకెళ్లగలిగే తత్వం ఉన్నప్పుడే లక్ష్యాలను సాధించగలరు. ఓటమికి భయపడి దేన్నీ మధ్యలో వదిలేయొద్దు. ఇక అడుగు వేయలేను   అన్న  పరిస్థితి అందరికీ వస్తుంది. నాకూ వచ్చింది. కానీ నేను మరింత బలంగా ప్రయత్నించా.. అదే గుర్తింపు తెచ్చింది. మీరూ ఆ బాటనే అనుసరించండి.. తప్పక కలలు సాధించుకోగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని