Actress Namita: సీమంతం వేడుకలో ఇలా మెరిసి మురిసిపోయింది!
అమ్మయ్యే క్రమంలో ప్రతి క్షణం ప్రత్యేకమే! అందుకే కొన్ని అపురూప క్షణాల్ని వేడుకగా జరుపుకొంటూ పది కాలాల పాటు మిగిలిపోయే జ్ఞాపకాలుగా మార్చుకుంటాం.. సీమంతం వేడుక కూడా అలాంటిదే! ఇటీవలే అందాల తార నమిత కూడా ఈ పేరంటాన్ని....
(Photos: Instagram)
అమ్మయ్యే క్రమంలో ప్రతి క్షణం ప్రత్యేకమే! అందుకే కొన్ని అపురూప క్షణాల్ని వేడుకగా జరుపుకొంటూ పది కాలాల పాటు మిగిలిపోయే జ్ఞాపకాలుగా మార్చుకుంటాం.. సీమంతం వేడుక కూడా అలాంటిదే! ఇటీవలే అందాల తార నమిత కూడా ఈ పేరంటాన్ని జరుపుకొంది. నెలలు నిండుతున్న కొద్దీ ముఖంలో పెరిగే ప్రెగ్నెన్సీ కళతో ఈ వేడుకలో మరింతగా మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన సీమంతం ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొని మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
తన సినిమా విశేషాలే కాదు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్నీ అభిమానులతో పంచుకుంటుంది నమిత. ఈ క్రమంలో త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు గత నెలలో ప్రకటించిందీ చక్కనమ్మ. ‘అమ్మతనం.. నా జీవితంలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. నన్ను మరింత ప్రేమగా, ఆప్యాయంగా మార్చింది. కన్నా.. ఇన్నాళ్లూ నీ కోసమే ఎదురుచూశా.. నీ రాక కోసమే ప్రార్థనలు చేశా. కడుపులో నీ కదలికలు నన్ను అమితమైన ఆనందంలో ముంచెత్తుతున్నాయి. నువ్వు నన్ను ముందెన్నడూ లేనంత కొత్తగా, ప్రత్యేకంగా, సంతోషంగా మార్చేశావు..’ అంటూ తన బేబీ బంప్ ఫొటోలతో అందరినీ సర్‌ప్రైజ్ చేసిందీ ముద్దుగుమ్మ.
ప్రెగ్నెన్సీ కళ ఉట్టిపడుతోంది!
ఇక అప్పట్నుంచి రాబోయే చిన్నారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ.. తన బేబీ బంప్, మెటర్నిటీ షూట్ ఫొటోల్ని అభిమానులతో పంచుకుంటోంది నమిత. ఇటీవలే సీమంతం వేడుకను జరుపుకొన్న ఆమె.. ఆ ఫొటోల్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో మెరిసిపోయింది. ఈ వేడుకకు హాజరైన కొందరు ప్రముఖులు కూడా నమిత సీమంతం ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసి చాలామంది ‘ఆమెలో ప్రెగ్నెన్సీ కళ ఉట్టిపడుతోందం’టూ కామెంట్లు చేస్తున్నారు.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మెరిసిన నమిత.. 2017లో సహ నటుడు వీరేంద్ర చౌధరిని వివాహం చేసుకుంది.
మరి, ఈ కాబోయే అమ్మ సీమంతం, మెటర్నిటీ షూట్ ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దామా?!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.