Pranitha Subhash: శరీరం మాట విన్నా!
పాప పుట్టిన ఏడాదికే పూర్వస్థితిలోకి వచ్చానంటే శరీరం మాట వినడమే కారణమని చెబుతా. చాలామందికి ప్రసవమయ్యాక పత్యం పేరుతో ఆహారం, తాగే నీటి పరిమాణం విషయంలో ఆంక్షలు పెడతారట.
ప్రణీత సుభాష్, నటి
పాప పుట్టిన ఏడాదికే పూర్వస్థితిలోకి వచ్చానంటే శరీరం మాట వినడమే కారణమని చెబుతా. చాలామందికి ప్రసవమయ్యాక పత్యం పేరుతో ఆహారం, తాగే నీటి పరిమాణం విషయంలో ఆంక్షలు పెడతారట. అమ్మ గైనకాలజిస్ట్. దీంతో నాకా ఇబ్బంది లేదు. ‘ప్రసవమయ్యాక శక్తి తగ్గుతుంది. శరీరం పుంజుకోడానికి పోషకాహారం కావాలి. అది అందేలా చూసుకో’మన్న తన సలహాని పాటించా. నా శరీరం మాట విన్నా. ఏవి తినాలనిపిస్తే అవి తిన్నా. తిరిగి నాజూగ్గా తయారవ్వాలని వెంటనే వ్యాయామాలు మొదలుపెట్టలేదు. మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాక రోజూ అరగంట నడవడం మొదలుపెట్టా. ఆరునెలల తర్వాత నిపుణుల ఆధ్వర్యంలో నెమ్మదిగా వ్యాయామాలు ప్రారంభించా. పిలాటిస్, డ్యాన్స్, నెమ్మదిగా పరిగెత్తడం చేసేదాన్ని. అదీ వారానికి మూడు రోజులు.. పాప నిద్రపోయాక మధ్యాహ్నమో, రాత్రో చేసేదాన్ని. పాపని ప్రామ్‌లో కూర్చోబెట్టుకొని సాయంత్రాలు తిప్పేదాన్ని. తనకి పర్యావరణం పరిచయం అవడమే కాదు, మా ఇద్దరి బంధం బలపడటానికీ అది సాయపడింది. పాపతో అలా నడిచిన రోజు వేరే వ్యాయామాల జోలికి వెళ్లేదాన్ని కాదు. పాప పెద్దదవుతోన్న కొద్దీ నన్ను అసలు వదిలిపెట్టడం లేదు. తరచూ ఎత్తుకోవడానికీ శక్తి కావాలి. దానికి తగ్గట్టుగానూ వ్యాయామాలుండేలా చూసుకుంటున్నా. మొత్తంగా అందం కంటే.. ఆరోగ్యంపై దృష్టిపెట్టా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.