ఈ ముద్దుగుమ్మలు ఏం చదివారో తెలుసా?
ఒక రంగంలో స్థిరపడితే ఇక చదువుకు స్వస్తి చెబుతుంటారు కొందరు.. చేతి నిండా సంపాదిస్తున్నాం కదా.. డిగ్రీలతో పనేముంది అనుకుంటారు మరికొందరు. కానీ తాను మాత్రం నిత్య విద్యార్థినే అంటోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా. అమ్మగా, రచయిత్రిగా, నిర్మాతగా, ఇంటీరియర్...
(Photos: Instagram)
ఒక రంగంలో స్థిరపడితే ఇక చదువుకు స్వస్తి చెబుతుంటారు కొందరు.. చేతి నిండా సంపాదిస్తున్నాం కదా.. డిగ్రీలతో పనేముంది అనుకుంటారు మరికొందరు. కానీ తాను మాత్రం నిత్య విద్యార్థినే అంటోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా. అమ్మగా, రచయిత్రిగా, నిర్మాతగా, ఇంటీరియర్ డిజైనర్‌గా.. ఇలా జీవితంలో ఎన్నో పాత్రలతో బిజీగా ఉన్న ఆమెకు.. ఉన్నట్లుండి ఉన్నత చదువులపై మక్కువ కలిగింది. తాను ఎంచుకున్న కల్పిత రచనల్లోనే (ఫిక్షన్ రైటింగ్) మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసమే లండన్ బయల్దేరి వెళ్లింది. ఇలా తనొక్కర్తే కాదు.. అటు కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే.. ఇటు ఉన్నత చదువులు పూర్తిచేసిన ముద్దుగుమ్మలు కొందరున్నారు. వాళ్ల గురించి తెలుసుకుందాం రండి..
రచనల్లో ‘మాస్టర్’ కావాలని..!
అటు కెరీర్‌కు, ఇటు వ్యక్తిగత జీవితానికి సమప్రాధాన్యమిచ్చే అందాల తారల్లో ముందుంటుంది ట్వింకిల్ ఖన్నా. నటిగా కెరీర్ ప్రారంభించినా.. నిర్మాతగా, ఇంటీరియర్ డిజైనర్‌గా, రచయిత్రిగా తనదైన మార్క్‌ను ప్రదర్శించిందీ ముద్దుగుమ్మ. ‘మిసెస్ ఫన్నీబోన్స్’, ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’, ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’.. వంటి నవలలు ఆమె అద్భుతమైన రచనాశైలికి అద్దం పడతాయి. ఇలా తన రచనలతో ‘బెస్ట్ సెల్లింగ్ ఆథర్’గా పేరుగాంచిన ట్వింకిల్.. కల్పిత రచనల్లో (ఫిక్షన్ రైటింగ్) మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే తన భర్త అక్షయ్, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్ వెళ్లింది. లండన్ యూనివర్సిటీకి చెందిన గోల్డ్స్మిత్స్ కళాశాలలో తన చదువు కొనసాగించనుందీ అందాల అమ్మ. ఈ క్రమంలో అక్షయ్ స్పందిస్తూ.. ‘ఎవరైనా తమ పిల్లల్ని కాలేజీలో దిగబెట్టడానికి వెళ్తారు. కానీ నేను నా భార్యను యూనివర్సిటీలో దింపడానికి లండన్ వచ్చాను. ఇక్కడే తను మాస్టర్స్ చేయబోతోంది..’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారాయన.
పేరులోనే ఉంది ‘విద్య’!
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది బాలీవుడ్ అందాల తార విద్యా బాలన్. 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలిసారిగా ‘హమ్ పాంచ్’ అనే టీవీ షోలో మెరిసింది. ‘భాలో థేకో’ అనే బెంగాలీ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైనా.. తనకు బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘డర్టీ పిక్చర్’ చిత్రమే! ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు ఈ చక్కనమ్మకు. అంతేకాదు.. ఉన్నత విద్యావంతులైన బాలీవుడ్ తారల్లో విద్య ఒకరు. సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి సోషియాలజీలో డిగ్రీ చదివిన ఈ అందాల తార.. ముంబయి యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసింది.
పటౌడీ బ్యూటీ.. ‘పీజీ’ పట్టా!
సినీ నేపథ్యం, శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది పటౌడీ ఆడపడుచు సోహా అలీ ఖాన్. హిందీ, బెంగాలీ భాషా చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చక్కనమ్మ.. పెళ్లై, కూతురు ఇనాయా పుట్టాక కుటుంబ జీవితానికే ప్రాధాన్యమిస్తోంది. మరోవైపు రచయిత్రిగానూ నిరూపించుకుంది సోహా. ఇప్పటికే ‘ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్’ అనే పుస్తకాన్ని రచించిన ఆమె.. తన భర్త కునాల్ ఖేముతో కలిసి మరో పుస్తకం రాస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే ఓవైపు నటిగా బిజీగా ఉన్న సమయంలోనూ తాను చదువును నిర్లక్ష్యం చేయలేదంటోందీ పటౌడీ బ్యూటీ. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్’ నుంచి అంతర్జాతీయ సంబంధాలపై మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిందీ అందాల అమ్మ.
ఒకటి, రెండు కాదు.. మూడు డిగ్రీలు!
బాలీవుడ్ ట్యాలెంటెడ్ నటిగా పేరు పొందిన పరిణీతి చోప్రాకు చదువంటే విపరీతమైన మక్కువ. అందుకే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ట్రిపుల్ ఆనర్స్ డిగ్రీ (ఏకకాలంలో మూడు సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేయడం) చేసింది. ఈ క్రమంలో యూకేలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్, ఫైనాన్స్, ఎకనమిక్స్.. ఈ మూడు ప్రధాన సబ్జెక్టుల్ని ఎంచుకుంది పరి. ఇలా చదువులో రాణించిన ఈ చక్కనమ్మ.. ‘లేడీస్ వర్సెస్ రికీ బల్’, ‘మేరీ ప్యారీ బిందూ’, ‘నమస్తే ఇంగ్లండ్’, ‘సైనా’.. వంటి చిత్రాలతోనూ మెప్పించింది. అంతేకాదు.. సాహసకృత్యాలన్నా పరిణీతికి చాలా ఇష్టం. ఈ క్రమంలోనే డైవింగ్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని..!
బాలీవుడ్లో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించి మెప్పించింది డింపుల్ బ్యూటీ తాప్సీ పన్ను. ‘పింక్’, ‘థప్పడ్’, ‘రష్మీ రాకెట్’, ‘శెభాష్ మిథూ’.. వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన ఈ చక్కనమ్మ.. నటి కాకముందు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేసిందట! కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తాప్సీ.. ఆపై నటనపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఇండస్ట్రీలో స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!