ఇవి ఉంటే ఇక ఉప్పు పప్పు కోసం వెతకక్కర్లేదు!
ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్ఫ్యూజన్కి చెక్ పెట్టాలంటే ‘కిచెన్ ర్యాక్స్’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్ ర్యాక్స్ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది..
అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే.
నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్పరెంట్గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే!
రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది.
ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్ఫ్యూజన్కి చెక్ పెట్టాలంటే ‘కిచెన్ ర్యాక్స్’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్ ర్యాక్స్ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్ ర్యాక్స్/మల్టీ పర్పస్ ర్యాక్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..
అడ్జస్టబుల్ బాంబూ స్టోరేజ్ ర్యాక్
ఈ తరం వారిలో క్రమంగా ఆరోగ్య స్పృహ పెరుగుతుండడంతో రాన్రానూ ప్లాస్టిక్ వాడకం తగ్గిపోయి.. పర్యావరణహితమైన వస్తువుల వాడకం పెరిగిపోతోంది. ప్రస్తుతం మనం కిచెన్‌లో ఉపయోగిస్తోన్న మట్టి పాత్రలు, చెక్క వస్తువులు.. ఈ కోవలోకే వస్తాయి. ఇలా కేవలం వండుకోవడానికి ఉపయోగించే వస్తువులే కాదు.. కిచెన్‌ను నీట్‌గా సర్దుకోవడానికి వీలుగా ఉండే ర్యాక్స్ కూడా చెక్కతో చేసినవి ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో లభ్యమవుతున్నాయి. అలాంటిదే ఈ ‘అడ్జస్టబుల్ బాంబూ స్టోరేజ్ ర్యాక్’ కూడా!
చిత్రంలో చూపించిన విధంగా వంటింటి వస్తువులను పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ లేదా షెల్ఫుల మాదిరిగా ఉంటుందిది. దీన్ని కిచెన్‌లో ఖాళీ ప్రదేశంలో స్టాండ్‌లా నిలబెట్టుకోవచ్చు.. లేదంటే ఫొటోలో చూపించిన విధంగా రిఫ్రిజిరేటర్‌కి తగిలించుకునేందుకు వీలుగా ఉంటుందిది. ఈ బాంబూ ర్యాక్లోనూ మీకు నచ్చిన విధంగా 2, 3, 4 ర్యాక్స్ ఉన్న దాన్ని ఎంచుకోవచ్చు. ఇది వివిధ రకాల ఆకారాల్లో, సైజుల్లో కూడా లభిస్తుంది.
స్పైస్ టవర్ బాక్స్
మన వంటింట్లో పప్పులు, ఉప్పులు.. వంటివి భద్రపరచుకోవడానికి ఒకే రకమైన డబ్బాల్ని ఉపయోగించడం తెలిసిందే. అయితే ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటే పర్లేదు.. కానీ డబ్బా మూత తీస్తే కానీ అందులో ఏముందో తెలియకపోతే మాత్రం అలాంటి డబ్బాలతో సమయం వృథానే అవుతుంది. పైగా ఒక్కో డబ్బా పక్కపక్కన అమర్చినా కాస్త స్పేస్ ఎక్కువే పడుతుంది. అలాకాకుండా మసాలాలన్నీ ఒకే డబ్బాలో, పప్పులన్నీ మరో డబ్బాలో.. ఇలా అమర్చుకుంటే వెతికే శ్రమా తగ్గుతుంది.. అలాగే కిచెన్‌లో స్పేస్ కూడా ఆదా అవుతుంది. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి ‘స్పైస్ టవర్ బాక్స్’లు. చిత్రంలో చూపించిన విధంగా క్యారియర్ మాదిరిగా ఉంటుందిది. పైగా దీన్ని గ్లాస్‌తో తయారుచేయడం వల్ల అందులో మీరు స్టోర్ చేసిన పదార్థాలు బయటికి కనిపిస్తాయి. సో.. ఎందులో ఏముందో టక్కున తీసుకొని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వంటింట్లో పని ఈజీగా పూర్తవడంతో పాటు కిచెన్ కూడా నీట్‌గా కనిపిస్తుంది.
అడ్జస్టబుల్ ప్యాన్ పాట్ ర్యాక్
గిన్నెలను కడిగిన తర్వాత తడిగా ఉన్న వాటిని నేరుగా ర్యాక్స్‌లో పెడితే ఆ తడిదనం వల్ల వాటికి తుప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే చాలామంది వాటిని ఆరబెట్టిన తర్వాత ర్యాక్స్‌లో సర్దుతుంటారు. మరి ఆరబెట్టడానికి ఓ ర్యాక్, సర్దుకోవడానికి ఓ ర్యాక్ అంటే ఇక మన పని పూర్తయినట్లే.. అనుకుంటున్నారా? ‘అడ్జస్టబుల్ ప్యాన్ పాట్ ర్యాక్’ ఉంటే ఇక ఆ శ్రమ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ ర్యాక్ సహాయంతోనే ఓవైపు గిన్నెలను ఆరబెట్టుకోవడం, మరోవైపు వాటిని అందులోనే అమర్చుకోవడం.. ఇలా రెండు పనులూ ఒకేసారి పూర్తవుతాయి. చిత్రంలో చూపించిన విధంగా ఒక ర్యాక్ మాదిరిగా ఉండే దీన్ని నేలపై లేదా కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచి.. కడిగిన గిన్నెలను ఏటవాలుగా ఉంచి ఆరబెట్టుకోవచ్చు.. ఆపై ఆ ర్యాక్‌ని నిలబెడితే.. ఆ గిన్నెలన్నీ ఒకదానిపై మరొకటి అమర్చినట్లుగా ఉంటాయి. అయితే వీటిపై పెద్ద పెద్ద గిన్నెల్ని అమర్చుకుందామనుకుంటే మాత్రం.. ర్యాక్ గ్రిల్స్‌ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్యాన్స్, కడాయిలు.. వంటివన్నీ ఒకేచోట పెట్టుకునే వీలుండడం వల్ల ఒక్కోదాన్ని ఒక్కోచోట పెట్టి వెతుక్కోవాల్సిన పని ఉండదు.
అండర్ సింక్ ఆర్గనైజింగ్ ర్యాక్
ఏంటీ.. సింక్ కింద కూడా వస్తువులు పెట్టుకోవచ్చా అనుకోకండి! కిచెన్ శుభ్రం చేయడానికి మనం వాడే వస్తువులు, లిక్విడ్ సోప్, స్క్రబ్బర్స్.. వంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎంచక్కా సింక్ కింద నీట్‌గా అమర్చుకోవచ్చు. ఫలితంగా స్పేస్ కూడా ఆదా అవుతుంది. అందుకోసం డిజైన్ చేసిందే ఈ ‘అండర్ సింక్ ఆర్గనైజింగ్ ర్యాక్’. చిత్రంలో చూపిన విధంగా అరలు అరలుగా ఉంటుందీ స్టాండ్. వీటి ర్యాక్స్ మధ్యలోని భాగాల్ని విడిగా తొలగించి మధ్యలో సింక్ పైప్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా.. మనం పెట్టే బాటిల్స్ పెద్దవైతే ఇందులోని అరల్ని తొలగించే సౌలభ్యం కూడా ఉంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
హ్యాంగింగ్ పాట్ ప్యాన్ ఆర్గనైజింగ్ ర్యాక్
గరిటలు, ప్లేట్స్.. ఇలా అన్నింటినీ ఒకచోట పెట్టుకునే ర్యాక్ దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీని నుండి మనకు కావాల్సిన వస్తువును మనం ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. వీటితో పాటు ప్యాన్, కడాయిలను కూడా అమర్చుకునే ర్యాక్ ఉంటే బాగుంటుంది కదూ! ఆ ఆలోచనతోనే ఈ ‘హ్యాంగింగ్ పాట్ ప్యాన్ ఆర్గనైజింగ్ ర్యాక్’ను తయారుచేశారు డిజైనర్లు. మనం వాడే రెగ్యులర్ ర్యాక్కి కాస్త ఆధునికత జోడించి రూపొందించిన ఈ ర్యాక్ ఫొటోలో చూపించినట్లుగా పైన అరలు, కింద హుక్స్ మాదిరిగా ఉంటుంది. పైన అరల్లో పెద్ద పెద్ద పాత్రల్ని పెట్టుకోవచ్చు.. కింద ఉండే హుక్స్‌కి గరిటలు, ప్యాన్స్ వేలాడదీయచ్చు. ఇలాంటి ర్యాక్‌ను చేతికి అందుబాటులో ఉండేలా ఎక్కడైనా గోడలకు తగిలించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!