తాలిబన్ల రాకతో వారు మళ్లీ ఇళ్లలోనే మగ్గిపోవాలేమో!
తాలిబన్ల ఆగడాలతో అఫ్గాన్ పౌరుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వాళ్లను తప్పించుకుని దేశం దాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు అభివృద్ధి వైపు అడుగులేసిన అఫ్గాన్ అమ్మాయిలు షరియా చట్టాలతో మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
(Photo: Instagram)
తాలిబన్ల ఆగడాలతో అఫ్గాన్ పౌరుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వాళ్లను తప్పించుకుని దేశం దాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు అభివృద్ధి వైపు అడుగులేసిన అఫ్గాన్ అమ్మాయిలు షరియా చట్టాలతో మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లోని మహిళలు, అమ్మాయిలను తాలిబన్లు ఇంటికి పంపించేస్తోన్న సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అఫ్గాన్‌కు చెందిన కరాటే ఛాంపియన్ 28 ఏళ్ల మీనా అసది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకార్తాలో శరణార్థిగా తలదాచుకున్న ఆమె... తాలిబన్ల రాకతో తమ దేశ మహిళా క్రీడాకారుల ఆశలు, ఆశయాలకు గండి పడతాయంటోంది. వారు మళ్లీ ఇళ్లల్లో మగ్గిపోవాల్సిన దారుణ పరిస్థితులు వస్తాయంటోంది.
కట్టుబాట్లను కాదని కరాటే!
చాలామంది అఫ్గాన్ అమ్మాయిల్లాగే తన కల కోసం కట్టుబాట్లను కాదనుకుంది మీనా. చిన్నతనంలోనే కరాటేపై ఆసక్తి పెంచుకొన్న ఆమె ఇప్పటికీ ఆటే జీవితంగా బతుకుతోంది. అఫ్గానిస్థాన్ నేషనల్ కరాటే ఫెడరేషన్లో చేరి కరాటేలో ఓనమాలు నేర్చుకుంది మీనా. అయితే అక్కడి అల్లకల్లోల పరిస్థితులు ఆమెను దేశం వదిలివెళ్లేలా చేశాయి. 12 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన మీనా అక్కడే కరాటేలో శిక్షణ తీసుకుంది. శరణార్థిగా ఎన్నో సమస్యలెదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగింది. వివిధ కరాటే పోటీల్లో పాల్గొని పతకాలు గెల్చుకుంది. 2010లో మళ్లీ అఫ్గాన్‌కు తిరిగొచ్చింది. అదే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా జరిగిన దక్షిణాసియా క్రీడల్లో అఫ్గాన్ తరఫున మూడు వెండి పతకాలు గెల్చుకుంది. ఆ తర్వాత 2012లో ఇండియాలో జరిగిన ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లోనూ రెండు రజత పతకాలు సాధించింది. ఈ క్రీడల్లో అఫ్గానిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన ఏకైక మహిళా క్రీడాకారిణి మీనానే.
దేశం విడిచిపెట్టి!
క్రీడాకారిణిగా పోటీల్లో పాల్గొంటూనే తన లాంటి అమ్మాయిలకు కరాటేలో శిక్షణ ఇవ్వాలనుకుందీ కరాటే ఫైటర్. ఇందుకోసం కాబూల్‌లో ఓ ఫైట్క్లబ్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంది. కానీ దేశంలోని అల్లకల్లోల పరిస్థితులు ఆమె ఆశయానికి అడ్డుపడ్డాయి. దీంతో తన భర్త, ఏడాది వయసున్న కూతురును తీసుకుని రెండోసారి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయింది.
అందుకే కరాటేకు ప్రత్యేక స్థానం!
2015 నుంచి ఇండోనేషియాలోని సిసారువా పట్టణంలో ఉంటోంది మీనా. అక్కడే ఓ కరాటే క్లబ్‌ను ఏర్పాటు చేసి తనలాంటి శరణార్థి అమ్మాయిలకు శిక్షణనిస్తోంది. ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్...తదితర దేశాలకు చెందిన మొత్తం 30 మంది అమ్మాయిలు ఆమె దగ్గర శిక్షణ పొందుతున్నారు. ఇందులో కొందరు బెల్ట్ ర్యాంక్ సర్టిఫికెట్లు కూడా అందుకున్నారు.
‘నా జీవితంలో కరాటేకు ప్రత్యేక స్థానముంది. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సమస్యలు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నాకు నేర్పింది. నా నైపుణ్యాన్ని మరికొంతమంది అమ్మాయిలకు అందిస్తున్నాను. ఎందుకంటే ఇది వారి హక్కులు కాపాడుకోవడానికి సహకరిస్తుంది’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది మీనా.
వారి ఆశలకు గండి పడుతుందేమో!
పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలి అఫ్గాన్ మహిళగా చరిత్ర సృష్టించాలనుకున్న పారా తైక్వాండో అథ్లెట్ జకియా ఆశలు తాలిబన్ల రాకతో అడుగంటిపోయాయి. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో జకియా ఒక్కటే కాదు...మున్ముందు అఫ్గాన్‌లోని మరికొంతమంది క్రీడాకారిణుల పరిస్థితి కూడా ఇదేనంటోంది మీనా.
‘చాలా బాధగా ఉంటోంది. తాలిబన్ల దురాక్రమణతో నాతో పాటు నాదేశ ప్రజలు కూడా ఆశలు కోల్పోయారు. ముఖ్యంగా మహిళా అథ్లెట్ల ఆశలు, ఆశయాలకు అడ్డుకట్ట పడుతుందేమోననిపిస్తోంది. ఇప్పటివరకు వారు సాధించిన అభివృద్ధి, ప్రగతికి అర్థం లేకుండా పోయాయి. అమ్మాయిలు ఇక ఇంటికి పరిమితం అవ్వాల్సి వస్తుందేమో..’ అని ఆవేదన చెందుతోందీ కరాటే ఫైటర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
- చెమట వాసనా..!
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
- ఆ సమయంలో సౌకర్యంగా ఉండాలంటే..!
- ప్రొటీన్ ఎక్కువ వద్దు..
అనుబంధం
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
- ఈ పాలు పిల్లలకు ఇస్తున్నారా... ఒక్క నిమిషం!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
- తెలుపు దుస్తులే ఎందుకు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!